Breaking News

సజావుగా కో ఆప్షన్‌ ఎన్నిక

 

ఆర్మూర్‌, డిసెంబరు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం కో ఆప్షన్‌ ఎన్నికలు సజావుగా జరిగాయి. అందులో భాగంగా తెరాసకు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ముందుగా ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అద్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో కో ఆప్షన్‌ ఎన్నికకు సంబంధించి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోల మధుకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రెండు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు ఓటింగ్‌ ప్రకారం జరిగాయి. అందులో తెరాసకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం

నూతన కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికైన ముగ్గురు తెరాస అభ్యర్తులను ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మునిసిపల్‌ అధికారులు, తదితరులున్నారు.

Check Also

బాటసారుల‌కు పాదరక్షల‌ వితరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆర్మూర్‌ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *