Breaking News

జనవరిలో సహకారబ్యాంకును ప్రారంభిస్తాం

 

మోర్తాడ్‌, డిసెంబరు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌లో నూతన భవన నిర్మాణంలో సహకార బ్యాంకును జనవరిలో ప్రారంభిస్తామని డిసిసిబి జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌రావు పట్వారి అన్నారు.

సోమవారం మోర్తాడ్‌ అంగడిబజార్‌లో 22 లక్షలతో నిర్మిస్తున్న సహకార బ్యాంకు భవన నిర్మాణ పనులను గంగాధర్‌రావు పట్వారి, సిఇవో, డైరెక్టర్‌ సోమ చిన్నగంగారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, మరో 15 రోజుల్లో అన్ని పనులు పూర్తవుతాయని సొంత భవనంలో సహకార బ్యాంకును జనవరి చివరి వారంలో ప్రారంభిస్తామని, రైతుల కోసం సహకార బ్యాంకు సేవలతో పాటు ఎటిఎం సేవలు కూడా ఏర్పాటుచేస్తున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్‌ ఎలాల రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి సి.హెచ్‌.నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *