Breaking News

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

 

నందిపేట, డిసెంబరు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన హన్మ పెద్ద గంగారాం (45) ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. కాగా సోమవారం ఉదయం గోదావరి శిఖం భూమిలో వేపచెట్టుకు ఉరివేసుకొని శవమై కనిపించినట్టు పోలీసులు తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. కాగా భార్య వారం రోజుల క్రితం కుటుంబ గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *