Breaking News

ధూం…. ధాం….

 

ఆర్మూర్‌, డిసెంబరు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఆర్మూర్‌ మునిసిపాలిటీకి చెందిన కో ఆప్షన్‌ ఎన్నికల్లో తెరాసకు చెందిన ముగ్గురు అభ్యర్తులు ఘన విజయం సాధించారు.

దీంతో గెలుపొందిన అభ్యర్థులు తెరాస కార్యకర్తలతో కలిసి మునిసిపల్‌ కార్యాలయం నుంచి డిజె శబ్దాలతో ఆటలు ఆడుతూ కేరింతలు కొడుతూ టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరిపారు. అనంతరం ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌, ఎంపి కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కార్యకర్తలను గుర్తించి వారిని ఎమ్మెల్యే ప్రోత్సహించి కో ఆప్సన్‌ సభ్యులుగా ఎన్నికయ్యేలా కృసిచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి

నందిపేట్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *