Breaking News

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

 

మోర్తాడ్‌, డిసెంబరు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ గ్రామంలోగల సురేశ్‌నగర్‌ కాలనీలో పర్వీన్‌ బేగం (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు ఆర్మూర్‌ డిఎస్పీ ఆకుల రాంరెడ్డి సోమవారం విలేకరులతో తెలిపారు.

పోలీసుల, స్తానికుల కథనం ప్రకారం… మృతురాలికి భర్త అబ్దుల్లా హమీద్‌, కుమారుడు ఇస్మాయిల్‌, కూతురు అమీనా బేగం ఉన్నారని, జీవనోపాధికై భర్త గల్ప్‌కు వెళ్లాడని, మృతురాలి కుమారుడు ఇస్మాయిల్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, కూతురు బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. మృతురాలి కుమార్తె వివాహం ఆదివారం సురేశ్‌ నగర్‌ కాలనీలో మాక్లూర్‌ మండలం చిక్లి గ్రామానికి చెందిన యువకునితో జరిగిందన్నారు.

సోమవారం ఉదయం పెళ్లికి వచ్చిన కుటుంబసభ్యులతో మృతురాలు తల్లి వెతకడంతో ఆరుబయట మంచంలో పడి ఉంది. విషయం తెలుసుకున్న మోర్తాడ్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి పోలీసులతో సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. పర్వీన్‌ బేగం అనుమానాస్పదంగా మృతి చెందడంతో భీమ్‌గల్‌ సిఐ రమణారెడ్డికి, ఆర్మూర్‌ డిఎస్పీ ఆకుల రాంరెడ్డికి, జిల్లా పోలీసు అదికారులకు సమాచారం అందించారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీం, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశీలించారు. తమకు ఎవరిమీద అనుమానం లేదని, ఎలా మృతి చెందిందో తెలియదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. కొందరు స్థానికులు ఆమె అనారోగ్యంతో ఉందని, కుటుంబ సమస్యలు, అనారోగ్యం కారణంగానే మెడకింద కత్తితో కోసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కూతురు వివాహం జరిగిన రాత్రే తల్లి మృతి చెందడం పట్ల స్థానికులు విస్తుపోతున్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *