Breaking News

ప్రాణహిత-చేవెళ్ల 22వ ప్యాకెజిని పున: ప్రారంభించాలి

 

సదాశివనగర్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రాణహిత-చేవెళ్ల ద్వారా నిర్వహించే 22వ ప్యాకెజిని పున: ప్రారంభించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పాదయాత్ర విజయవంతమైంది.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ ఇక్కడి ప్రాంత రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మండలంలోని భూంపల్లి గ్రామం నుంచి పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వరకు 6 కి.మీల మేర పాదయాత్ర చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని, ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రాజెక్టు పూర్తిచేయలేదని మండిపడ్డారు. 22వ ప్యాకెజి ప్రారంబించే వరకు అఖిలపక్షం ఆద్వర్యంలో ఉద్యమాలు చేస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అరికెల నర్సారెడ్డి, నల్లమడుగు సురేందర్‌, బిజెపి నాయకులు మురళీదర్‌గౌడ్‌, సిపిఎం నాయకులు మల్లారెడ్డి, న్యూడెమోక్రసి నాయకులు మల్లేశ్‌, మండల నాయకులు బద్దం శ్రీనివాస్‌రెడ్డి, పండ్ల రాజు, ఎస్‌డి మోహినోద్దీన్‌, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *