Breaking News

42 వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు

 

బోధన్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో దీక్షలు కొనసాగుతున్నాయి. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలని డిమాండ్‌ చేస్తూ దీక్షలు మంగళవారం నాటికి 42వ రోజుకు చేరుకున్నాయి.

షుగర్‌ కర్మాగారాన్ని అక్రమంగా లే ఆఫ్‌ చేయడాన్ని రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవులు వ్యతిరేకించారు. లే ఆఫ్‌ను వెంటనే ఎత్తివేయాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్‌డిఎస్‌ఎల్‌ మేనేజ్‌మెంట్‌ ఎవరికి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి లే ఆఫ్‌ చేయడంతో కార్మికులు, కర్సకులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నప్పటికి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు గత మూడునెలలుగా వేతనాలు చెల్లించకుండా వేతన సవరణ చేయకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దీక్షలో రక్షణ కమిటీ సభ్యులు డి.మల్లేశ్‌, షేక్‌బాబు, గంగాధర్‌, తదితరులున్నారు. వీరికి లింగాయత్‌ సమాజ్‌ అధ్యక్షులు మాధవరావు పటేల్‌, రాజేశ్వర్‌ పటేల్‌, కల్దుర్కి గంగారాం, యాదవరావు పలువురు సంఘీబావం తెలిపారు.

Check Also

‘ఆల‌న’ ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లాలో అసంక్రమిక ...

Comment on the article