Breaking News

హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి

టాలీవుడ్ లో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈశ్వర్ సినిమాతో కామెడియన్ గా పరిచయం అయిన నటుడు పొట్టి రాంబాబు(35) ఈ రోజు(మంగళవారం) ఉదయం మరణించారు. దాదాపు 40కి పైగా సినిమాలో నటించిన రాంబాబు ఈశ్వర్, క్లాస్ రూమ్, చంటిగాడు, కథానాయకుడు, దొంగా దొంగది, అస్త్రం, ప్రేమతో నువ్వు వస్తావని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.చాలా మంది కామెడియన్ లు హీరోలుగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నేపధ్యంలో ఇటీవల పులిరాజా ఐపియస్ పేరుతో హీరోగా మారే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మెదడులో రక్తం గడ్డకట్టి స్ట్రోక్ రావటంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. రాంబాబుకు భార్య ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు.

రాజమండ్రి దగ్గర బూరుగుపూడి ఆయన స్వగ్రామం. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ చాలా మంది హాస్యనటులను కోల్పోగా అదే వరసలో పొట్టి రాంబాబు కూడా తెలుగు సినీ అభిమానులకు దూరమయ్యారు.

Check Also

‘కాలుతోందా మీకు..’ విజయ్ దేవరకొండ కామెంట్స్

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఇప్పుడో సెన్సేషనల్. అర్జున్‌రెడ్డి సినిమాపై విమర్శలు చేసిన వీహెచ్‌ను ‘తాతా చిల్’.. అన్నా.. సెన్సార్ టీంను ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *