Breaking News

విద్య కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం

 

-ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌బాబు

కామారెడ్డి, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయికరణకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలు చేస్తుందని జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌బాబు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం కామారెడ్డిలో నిర్వహించారు.

కొత్త బస్టాండ్‌ ఎదుట జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 లో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భవించిందన్నారు. నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తుందన్నారు. తెరాస ప్రభుత్వం కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అనిచెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయినా హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. స్కాలర్‌షిప్‌లు, పీజు రీయంబర్స్‌మెంట్‌లు వందల కోట్లు పెండింగ్‌లో ఉన్నా వాటిని విడుదల చేయకుండా యాగాలు చేయడం గర్హణీయమన్నారు. వెంటనే విద్య రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అరున్‌,రాజు, పృత్వీరాజ్‌, సంజీవ్‌, కిషోర్‌, ఫెరోజ్‌, వంశీ, చరణ్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

35వ డివిజన్‌లో చక్కగా మొక్క‌లు నాటారు

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 35వ డివిజన్‌ నాందేవ్‌వాడలో ...

Comment on the article