Breaking News

జన సూచన అభియాన్‌- పౌర సమాచార ఉత్సవం

 

ఆర్మూర్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టనంలోని జావిద్‌భాయ్‌ మినీ స్టేడియంలో మంగళవారం పౌరసమచార ఉత్సవానికి సంబంధించిన బ్రోచర్‌ను తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల వల్ల గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం పౌర సమాచార ఉత్సవమన్నారు.

ఈ ఉత్సవం 2006 నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు కొనసాగుతాయని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, సంస్తలు పాల్గొంటాయని ఆయన వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 47 ఉత్సవాలు జరిగాయని, తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉత్సవం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో 2014 నవంబర్‌లో జరిగిందనిగుర్తుచేశారు. రెండో ఉత్సవం మెదక్‌లోనిసిద్దిపేటలో జరిగిందని, మూడో ఉత్సవానికి నిజామాబాద్‌ జిల్లా వేదిక కానుందని ఆయన తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన వివిద విభాగాలు, సంబంధిత జిల్లా పాలనా యంత్రాంగం సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారన్నారు. ఉత్సవ స్థలంలో 40 స్టాళ్ళను ఏర్పాటు చేస్తారని, వివిధ విభాగాలు తమకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శిస్తారన్నారు. స్వయం సహాయక సంఘ బృందాలు, గిరిజన సంస్థలు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన వారు తమ తమ ఉత్పత్తులు ఇక్కడ విక్రయించుకోవచ్చని చెప్పారు. వివిధ విభాగాల నుంచి వ్యక్తులు తమ విభాగం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరిస్తారని తహసీల్దార్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రవిందర్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *