Breaking News

సోంపూర్‌లో రెవెన్యూ సదస్సు

 

బోదన్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండలంలోని సోంపూర్‌లో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్‌ రాజేశ్వర్‌ పట్టా మర్పిడిపై రైతులకు వివరించారు. 28 మంది పట్టామార్పిడి చేసి పాసుపుస్తకాలు అందజేశారు. వ్యవసాయ భూమి ఉండి గ్రామంలో చనిపోయిన రైతుల స్థానంలో వారి వారసులకు పట్టామార్పిడి చేసి ఇస్తున్నట్టు తహసీల్దార్‌ వివరించారు. గ్రామంలో రెవెన్యూ పరమైన సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ త్రయంబక్‌ రావు, ఎంపిటిసి గంగాధర్‌, ఆర్‌ఐ, విఆర్వో రైతులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *