Breaking News

అభివృద్దికి కృసి చేస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

 

ఆర్మూర్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు మండలంలోని భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం నవనాథ సిద్దులగుట్టపైడబుల్‌ రోడ్డు కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నిధులు మంజూరుచేయించినందుకు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పెంట జలందర్‌ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయాన్నినిర్మిస్తున్నామని వివరించారు. ఈ ఆలయంతోపాటు నూతనంగా 9 మందిరాల నిర్మాణానికి ఎమ్మెల్యే కృసి చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సిద్దులగుట్టను పర్యాటక క్షేత్రంగా ఎమ్మెల్యే తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రోడ్డుకోసం ఆర్‌అండ్‌బి ద్వారా 4 కోట్ల 10 లక్షలు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *