Breaking News

లక్ష్మినర్సింహ ఆలయంలో దుకాణాల వేలం

 

ఎడపల్లి, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని జాన్కంపేట శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయంలో బుధవారం పూజావస్తు సామగ్రిలకు వేలం వేశారు. జనవరి 2వ తేదీన శనివారం అష్టమి, 9వ తేదిన శనివారం అమావాస్య రానున్న సందర్భంగా భక్తులు ఆలయానికి విశేషంగా తరలివస్తారు.

ఆయా తేదీల్లో ఆలయాల్లో వ్యాపారులు పూజాసామగ్రి, కొబ్బరికాయ, లడ్డు, పులిహోర, పార్కింగ్‌ విక్రయించుకునేందుకు గాను వేలం వేసినట్టు దేవాదాయశాఖ ఇన్స్‌పెక్టర్‌ కమల, ఇవో రవిందర్‌ తెలిపారు. ఇందులో కొబ్బరికాయలకు 30 వేలు, లడ్డు, పులిహోరకు 36 వేలు, పార్కింగ్‌కు 4 వేల రూపాయలకు వేలం వేసినట్టు వారు చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే పవిత్ర ఏకైక అష్టముఖి కోనేరు ఇక్కడ వెలిసి ఉందని, ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే వేలాదిగా తరలివస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ బండారి దశరథ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రఘునాథ్‌, తదితరులున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *