Breaking News

న్యూ ఇయర్‌వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలి

 

ఆర్మూర్‌, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ యువత న్యూ ఇయర్‌ వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని సిఐ సీతారాం బుదవారం తెలిపారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికే డిసెంబరు 31న రాత్రి సమయంలో న్యూఇయర్‌ వేడుకలకు సంబంధించి మద్యం సేవించి వాహనాలు నడపడం, గుంపులు గుంపులు తిరిగినా, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వివరించారు. మోటార్‌ సైకిల్‌పై రాత్రిళ్లు త్రిపుల్‌ రైడింగ్‌, ర్యాలీలు నిషేదించినట్టు ఆయన చెప్పారు. కావున ప్రజలు, యువకులు శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని పోలీసులకు సహకరించాలని సూచించారు.

Check Also

ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి

నందిపేట్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *