Breaking News

పాటతోనూ ‘బాహుబలి’ రికార్డు మోత…

బాహుబలి సినిమాలో అవంతిక పాత్రను పోషించి “పచ్చబొట్టేసిన పిల్లగాడ…” అంటూ కుర్రాళ్ల గుండె లయ తప్పేలా చేసింది తమన్నా. అందుకే ఇప్పటికీ ఈ పాటకు సోషల్ మీడియాలో లైకుల మీద లైకులు వచ్చి పడుతున్నాయి.

తాజాగా ఈ పాటకు అక్షరాల కోటి యాభై లక్షల క్లిక్కులు పడ్డాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్, తమన్నా మధ్య సాగిపోయే ఈ రొమాంటిక్ సాంగ్‌ను బాహుబలి యూనిట్ అధికారిక యూ ట్యూబ్ చానెల్‌లో లాంచ్ చేసిన తర్వాత యువతరం క్లిక్కులతో హోరెత్తించేశారు. తమన్నా బ్యాక్ లెస్‌లో అదుర్స్ అంటూ జనం తెగ మురిసిపోయారు.

ఆ రీతిన తమన్నా బ్యాక్ లెస్‌తోనే ఈ పాటకు యూ ట్యూబ్‌లో ఇన్ని క్లిక్కులు లభించాయనీ చెప్పొచ్చు… ఇదిలాఉంటే.. ఈ యేడాది టాలీవుడ్‌లో టాప్ మూవీగా నిలచిన ‘బాహుబలి’ ఆల్ ఇండియా టాప్ టెన్‌లో రెండో స్థానంలో నిలచింది..అలా బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాదు సోషల్ నెట్ వర్క్ లోనూ ‘బాహుబలి’ భళా అనిపించింది. వీటికి తోడు తాజాగా యూ ట్యూబ్‌లో ఈ సినిమా పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం మరో విశేషం. మునుముందు ‘బాహుబలి’ ఇంకా ఏ తరహా రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి…

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *