Breaking News

వాస్తవాలు మాట్లాడండి

 

బోధన్‌, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, వారు మాట్లాడినవన్ని అవాస్తవాలని బుధవారం మునిసిపల్‌ ఛైర్మన్‌ ఆనంపల్లి ఎల్లయ్య అన్నారు.

ఈ మేరకు ఆయన కమీషనర్‌ దేవేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎవరి దగ్గర డబ్బు తీసుకొని సిబ్బందిని నియమించడం జరిగిందన్న ఆరోపణ అవాస్తవమని స్పష్టం చేశారు. ఇతరత్రా పండగల నిమిత్తం ప్రజానీకానికి ఇబ్బందులు కలగకూడదని రోజువారి కూలీలను నియమించి పనులు నిర్వహించడం జరిగిందన్నారు. వీరికి రోజుకు రూ. 250 చొప్పున కూలీ చెల్లించామని వివరించారు. వీరిని నియమించే ముందుకూడా కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాతనే విదుల్లోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

మునిసిపాలిటీలో సిబ్బంది తక్కువగా ఉన్నందునే వీరిని నియమించడం జరిగిందన్నారు. ప్రతినెల కౌన్సిల్‌ తీర్మానం పొందిన తర్వాతనే వీరు విధుల్లో హాజరవుతున్నారని వివరించారు. నిజాంసాగర్‌ నుంచి నీటిని విడుదల చేసినపుడు 20 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. మంచినీటిని కాపాడుకునే బాద్యత మనందరిది కాదా అని ప్రశ్నించారు. ఎవరి వద్ద ఏం ఆశించి నియమించలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మండిపడ్డారు. ఎక్కడ ఏ అధికారి వ్యవహారాలు తప్పుదోవ వహిస్తున్నా సూటిగా వచ్చి తమకు తెలియజేయవచ్చని సూచించారు. అదేవిధంగా ఎముకల ఫ్యాక్టరీ విషయంలో ఇదే కాంగ్రెస్‌ నాయకులు పట్టణంలో ధర్నాలు నిర్వహించి ఏమి తేల్చారని, ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అవాస్తవాలు మాట్లాడతారో ప్రజలకు తెలుసని, అవాస్తవమైన ఆరోపణలు చేయడం తగదని మండిపడ్డారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *