Breaking News

43 వరోజుకు చేరిన రిలే దీక్షలు

 

బోదన్‌, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నాటికి దీక్షలు 43వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్నవారికి వరదయ్య పూలమాలవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది హన్మంత్‌రావు మాట్లాడుతూ చక్కర కర్మాగారాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని కార్మికులు, కర్షకులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గత మూడునెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలో న్యూడెమోక్రసి చంద్రయ్య బృందం నీరడి విఠల్‌, మల్లేశ్‌, పట్టణ అక్కినేనియువజన సంఘం అధ్యక్షుడు గంగాప్రసాదప్ప, కె.సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *