Breaking News

ప్రజా సమస్యలపై ఇంటింటికి సిపిఎం

 

కామారెడ్డి, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా సమస్యలపై ఇంటింటికి వెళ్లనున్నట్టు సిపిఎం గౌరవ సలహాదారుడు తిరుపతి తెలిపారు. బుధవారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రతి పేద కార్మికునికి వర్తించేలా చూడాలన్నారు. కళ్యాణలక్ష్మి, బంగారుతల్లి పథకాలను అందరికి వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజనర్సు, మల్లవ్వ, లక్ష్మి, జ్యోతి, నాగవ్వ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *