Breaking News

ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి

 

ఎడపల్లి, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలుజరుపుకునేవారు ప్రశాంతంగా జరుపుకోవాలని బోధన్‌ డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన ఎడపల్లి పోలీసు స్టేషన్‌ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యువకులు మద్యం సేవించి రోడ్లపై హంగామాలు సృష్టించవద్దని, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి ధ్వని కాలుష్యం చేయవద్దని పేర్కొన్నారు. డిజె శబ్దాలు కూడా అర్ధరాత్రి వరకు ఉంచరాదని, ఎవరికి ఇబ్బంది కలగకుండా వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు.

అటువంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించడం జరుగుతుందని, ఎవరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. ఇదిలా ఉండగా క్రైం రేటు తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ యేడాది ఆరునెలల వరకు 60 నుంచి 70 శాతం క్రైమ్‌ రేటు నమోదు కాగా, ఇప్పటివరకు క్రైం రేటు పెరిగిందన్నారు. ప్రజలు గ్రామాల్లో నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు గ్రామాల్లోనే పరిష్కరించుకోవాలన్నారు. అనుమానితులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బంది సంఖ్య వారి పనితీరు వివిధ అవసరాల గురించి ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్‌ఐ ఎం.డి. హసీఫ్‌ ఉన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *