Breaking News

విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి

 

మోర్తాడ్‌, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి విద్యార్థిని చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేకాధికారి శంకరయ్య అన్నారు. బుధవారం మోర్తాడ్‌లోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

విద్యార్తులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని, బోదన తీరుతెన్నులను, తరగతి గదులను, వంట గదిని పరిశీలించారు. విద్యార్థులను భోదన తీరుపై అడిగి తెలుసుకున్నారు. అంతేగాకుండా విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేలా సూచనలు, సలహాలు అందించారు. తెరాస ప్రభుత్వం విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఎండివో రాజ్‌వీర్‌, ఎంఇవో రాజేశ్వర్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌ స్వప్న, ఉపాధ్యాయినిలు, సిఆర్‌పి తదితరులున్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *