Breaking News

కార్మికుని కుటుంబానికి ఆర్తిక సాయం

 

కామారెడ్డి, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియాలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తూ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన స్వామి కుటుంబానికి కాంట్రాక్టు కార్మికులు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం తీర్మానం ప్రకారం ప్రభుత్వం పక్షాన కార్మికుని కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేలా కృసి చేయాలన్నారు. అవినీతి టెండరు విధానానికి స్వస్తి పలకాలని, ప్రస్తుతం నడుస్తున్న కాంట్రాక్టు విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో లక్ష్మణ్‌, నర్సింగ్‌రావు, రాజనర్సు, ప్రభాకర్‌, రాజు, అయాజ్‌, తదితరులు ఉన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *