Breaking News

ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో రాస్తారోకో

 

కామారెడ్డి, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో విద్యార్తులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుదవారం ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో కామారెడ్డి కొత్తబస్టాండ్‌ ఎదుట జాతీయరహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యాగాల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తూ, స్కాలర్‌షిప్‌ల కోసం నిధులు విడుదల చేయకపోవడం గర్హణీయమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డంపెట్టుకొని పాలనలోకి వచ్చి విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేయకపోవడం సమంజసం కాదన్నారు. స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే వారిపై ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ ప్రతినిదులు సందీప్‌ కుమార్‌, నిఖిల్‌, ప్రమోద్‌రెడ్డి, వేణు, ఆజాం, మెహర్‌, సురేశ్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం బాగా కృషి చేశారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి, ఋతుపవనాల‌రాకకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *