Breaking News

ప్రవాసులకు శుభవార్త! గల్ఫ్ దేశాలలో లేబర్ బ్యాన్ తొలగింపు

పొట్ట చేత బట్టుకొని ఎంతో మంది గల్ఫ్ దేశాలకు సంపాదన కోసం వెళుతుంటారు. అక్కడ ఎన్నో కష్టాలకోర్చి ఉద్యోగం చేసుకుంటూ, జీవనాన్ని గడుపుతుంటారు. కాని వీరికి అక్కడ పడే కష్టాలలో అతి ముఖ్యమైనది లేబర్ బ్యాన్.

యూఏఈలోని అబుదాబి, అజ్మాన్, షార్జా, దుబాయ్, ఫుజారహ్, రసల్‌ఖైమా, ఉమర్‌అల్ క్వైన్, ఖతర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేయాలనుకుంటే తప్పనిసరిగా రెండు సంవత్సరాలు ఎక్కడికీ వెళ్ళకుండా, అదే కంపెనీలో/అదే యజమాని వద్ద, ఉద్యోగికి నచ్చిన, నచ్చకున్నా పని చేయాలి. ఉద్యోగి అక్కడ 2 సంవత్సరాలు ఉద్యోగం చేయకుండా, మధ్యలోనే స్వదేశానికి వెళ్ళిపోతే, అతని పై 6 నెలలపాటు లేబర్ బ్యాన్ ఉంటుంది. ఈ 6 నెలల పాటు సదరు వ్యక్తి ఆయా దేశాలకు వెళ్ళుటకు కాని, ఉద్యోగం చేయుటకు కాని అనర్హుడు. ఈ నిబంధన ఎందరో ప్రవాసులకు కష్టతరంగా మారినది.

ఇప్పుడు ఈ నిబంధనను యూఏఈ మరియు ఖతర్‌ లలో 1 జనవరి 2016 నుండి తొలగిస్తున్నట్లు మినిస్టర్ ఆఫ్ లేబర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది.

కొత్త సంవత్సరం ప్రవాసులకు ఒక పెద్ద సమస్యగా మారిన లేబర్ బ్యాన్ నుండి ఊరట కల్పించి, ఎన్నో సంతోషాలను తనతో తీసుకురానున్నందుకు ప్రవాసులంతా ఆనందంతో మునిగితేలుతున్నారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *