Breaking News

మాజీ స్పీకర్‌కు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సవాల్‌

 

నందిపేట, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట మండలంలో వివిధ అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడారు.

మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి అనుచిత విమర్శలు చేశారని, వారి పాలనలో చేయలేని అభివృద్దిని 18 నెలల్లో చేశామని, కావాలంటే అభివృద్ధి ఎజెండాగా మండల కేంద్రంలోగాని, ఆంధ్రనగర్‌లోగాని ప్రజాదర్బార్‌ పెట్టి ప్రజలముందు తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలోని 130 వాగ్దానాలు నెరవేర్చిందని అన్నారు. ఆర్మూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం, ఎర్రజొన్న రైతులకు బకాయిల చెల్లింపు, నందిపేటలోని బైపాస్‌ రోడ్డుకు 13 కోట్లు, నియోజకవర్గంలో 56 వేల మందికి పింఛన్లు ఇన్ని రకాలుగా అభివృద్దిలో ముందుకు పోతున్న తమను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కుగాని, సురేశ్‌రెడ్డికి గాని లేవని పేర్కొన్నారు. 110 కోట్లతో లక్కంపల్లిలో వ్యవసాయ ఆధారిత ప్యాక్టరీలు నెలకొలుపుతున్నటు, దాని ద్వారా 12 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. అభివృద్దిపై చర్చించడానికి ఏరోజైనా, ఎక్కడైనా తాను సిద్దమని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ జడ్పిటిసి సాందన్న, తెరాస నాయకులు ఉల్లి శ్రీనివాస్‌గౌడ్‌, వెల్మల్‌ రాజన్న, సుధాకర్‌, భూమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు మున్సిపాలిటీలలో 25వ తేదీ శనివారం ఉదయం 8 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *