Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపుపట్ల సంబరాలు

 

కామారెడ్డి, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పోటీచేసిన 6 చోట్ల 4 విజయాలు సాధించడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే పార్టీశ్రేణులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఇటీవల జరిగిన వరంగల్‌ ఉప ఎన్నికల్లో పార్టీని నమ్మి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని, ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం నాలుగు స్థానాల్లో అఖండ మెజార్టీని అందించారని అన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రవిందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, భూమేశ్‌ యాదవ్‌, లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

విధుల పట్ల అలసత్వం తగదు

కామారెడ్డి, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిఎంఅండ్‌ హెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ మచారెడ్డి పిహెచ్‌సిని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *