Breaking News

Daily Archives: January 2, 2016

సమస్యల అధ్యయనం కోసం ఇంటింటికి సిపిఎం

  కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సమస్యల అధ్యయనం కోసం ఇంటింటికి సిపిఎం ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు పార్టీ మండల కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఇందులోభాగంగా శనివారం వార్డులో పర్యటించారు. పట్టణంలోని 33 వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని అధ్యయనం చేస్తామన్నారు. ప్రజలు తమ ఇళ్లకు వస్తున్న సిపిఎం కార్యకర్తలను ఆదరించి తమ సమస్యలు విన్నవించాలని కోరారు. పార్టీ చేపట్టే ప్రజా ఉద్యమాలకు విరాళాలు ఇచ్చి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ...

Read More »

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

  కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ఈనెల 10న నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ 20వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వర్‌రావు కోరారు. శనివారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య హాజరుకానున్నట్టు తెలిపారు. మహాసభలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం గురించి చర్చించిభవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని దుయ్యబట్టారు. కెసిఆర్‌ చండియాగం వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని, ఇది ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 18వ వార్డులో శనివారం సిసి రోడ్డుపనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు 2 లక్షలతో రోడ్డు పనులు చేపట్టినట్టు తెలిపారు. పనులు నాణ్యతతో చేయాలని కాంట్రాక్టరును ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ ముదాం సుద్దమ్మ, నాయకులు రాములు, అతీఫ్‌, రాజు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా కాళభైరవస్వామి జయంతి ఉత్సవాలు

  కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూర్‌ గుమాస్తా కాలనీలోని కాళభైరవస్వామి ఆలయంలో స్వామివారి 27వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం దీపారాధన, గురుప్రార్థన, గోపూజతో కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మంటపారాధన నిర్వహించారు. శ్రీకాళభైరవస్వామికి రుద్రాభిషేకం, విశేష పుష్పార్చన చేశారు. ఆంజనేయస్వామికి అభిషేకం, సింధూర పూజ, మంగళహారతి చేశారు. హోమాలు, మహా పూర్ణాహుతిని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్న వేళ డోలారోహనం చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని విశేషంగా జరిపారు. కార్యక్రమంలో ...

Read More »

ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేదించి పర్యావరణం పరిరక్షించాలి

  – మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేదించి పర్యావరణం పరిరక్షణకు పాటుపడాలని మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. శనివారం కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సభ్యులకు ప్లాస్టిక్‌ బ్యాగులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమెమాట్లాడుతూ ప్లాస్టిక్‌ బ్యాగుల వల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతుందన్నారు. ప్లాస్టిక్‌ సంచులు భూమిలో నాశనం కాకుండా వెయ్యి సంవత్సరాల వరకు అలాగే ఉంటాయని, దీంతో పర్యావరనానికి తీవ్ర హాని ...

Read More »

తొర్తిలో గ్రామసభ

  మోర్తాడ్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తొర్తి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో స్తానిక సర్పంచ్‌ గొల్ల మాదమ్‌ పెంటవ్వ అధ్యక్షతన గ్రామ సభ శనివారం జరిగింది. ఇందులో కార్యదర్శి స్వప్న ఇప్పటివరకు జరిగిన గ్రామంలోని అభివృద్ది పనులను, సమస్యలను చదివి వినిపించారు. గ్రామంలోనెలకొన్న సమస్యలను పలు తీర్మానాలు చేసి నివేదికలు రూపొందించి ఎండివో ద్వారా జిల్లా కలెక్టర్‌కు పంపనున్నట్టు కార్యదర్శి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌నర్సయ్య, ఎంపిటిసి జక్కని గంగాధర్‌, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు, గ్రామస్తులు, విడిసి ...

Read More »

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలి

  మోర్తాడ్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ గ్రామానికి చెందిన ఇళ్లులేని లబ్దిదారులు ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని మోర్తాడ్‌ తహసీల్దార్‌ వెంకట్రావు కోరారు. శనివారం మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకోసం దరకాస్తులు స్వీకరించారు. ఈనెల 7వ తేదీ లోపు గుడిసెలు వేసుకున్నవారు, ఇళ్లులేనివారు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకోసం దరకాస్తులు చేసుకోవాలని ఆయన అన్నారు. విఆర్వోలు, అంగన్‌వాడి కార్యకర్తలు, గ్రామ సేవకులు ఇంటింటికి తిరిగి ప్రచారం ...

Read More »

గొల్లకుర్మ యాదవ సంఘాల అభివృద్దే ధ్యేయం

  మోర్తాడ్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొల్లకుర్మ యాదవ సంఘాల సభ్యుల అభివృద్దే ధ్యేయంగా సిఎం కెసిఆర్‌ కృసి చేస్తున్నారని జిల్లా పశు సంవర్ధకశాఖ జెడిఎ ఎల్లన్న అన్నారు. శనివారం మండలంలోని తొర్తిగ్రామంలో ఉచిత నట్టల నివారన మందుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాలు వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 9 లక్షల గొర్రెలు, 5 లక్షల మేకల నట్టల నివారణకై డిసెంబరు 30 నుంచి జనవరి 5 వరకు ...

Read More »

పెర్కిట్‌ రోడ్లు దుబ్బమయం

  పెర్కిట్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెర్కిట్‌ బైపాస్‌ రోడ్డు నుంచి మామిడిపల్లి వరకు రోడ్లు ఊడ్చే వారు లేక మొత్తం రోడ్లకు ఇరువైపులా మట్టి పేరుకుపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్లు దుబ్బతో నిండిపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ వారు దుబ్బ రోడ్డు శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనాలు కోరుతున్నారు.

Read More »

పెర్కిట్‌లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు

  పెర్కిట్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెర్కిట్‌లోని కొచ్చెరువులో డిసెంబరు 5వ తేదీ నుంచి జనవరి పూర్తి నెలవరకు ఉపాధి హామీ పనులు కొచ్చెరువులో కొనసాగుతాయని దీనికి ప్రతిరోజు కూలీలందరు హాజరవుతున్నారని ఎస్‌ఎ డి. మమత వివరించారు. తవ్వకాల ద్వారా తీస్తున్న మట్టిని పలు రోడ్లపై ఉన్న గుంతలకు మరమ్మతులు చేసేందుకు ఉపయోగిస్తున్నామని, దీనివల్ల చెరువు కట్టపై నుంచి హౌజింగ్‌ బోర్డు వెళ్లే వారికి రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి పూర్తిగా కృషి చేస్తున్నామని ఎస్‌ఎ మమత ...

Read More »

మూగ జీవాలకు నీటి తొట్టెలు నిర్మించాలి

  ఆర్మూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మూగ జీవాలకు నీటి సౌకర్యం కల్పించాలని మండల ప్రత్యేకాధికారి రామారావు నాయక్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగ జీవాలకు నీటి సమస్యలు తీర్చడానికి అవసరమైన నీటి తొట్టెలకు ప్రతిపాదనలు పంపించాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో స్మశాన వాటికలు, చెరువుల వద్ద ముఖ్యమైన ప్రదేశాలను గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరవుతాయని ఆయన పేర్కొన్నారు.

Read More »

గ్రామ జ్యోతి కమిటీలకు శిక్షణ

  ఆర్మూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని గ్రామ జ్యోతి కమిటీలకు ఈనెల 4వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంపిడివో లింగయ్య శనివారం తెలిపారు. ఈ కమిటీలకు 7 అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. గ్రామ జ్యోతి కమిటీలు శిక్షణలో పాల్గొనాలని సూచించారు.

Read More »

ఆర్మూర్‌ మండలంలో బయోమెట్రిక్‌ ప్రారంభం

  ఆర్మూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని స్థానిక మండల పరిసత్‌ కార్యాలయంలో ఉద్యోగులు సమయ పాలన పాటించాలని సోమవారం నుంచి బయోమెట్రిక్‌ పద్దతిని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా ఆదేశాల మేరకు జడ్పి సిఇవోమోహన్‌లాల్‌ ఆర్మూర్‌ మండలంలో బయోమెట్రిక్‌ పద్ధతిని ప్రారంభించారు. మండలంలోని ఎంపిడివో, సూపరింటెండెంట్‌తో పాటు సిబ్బంది ప్రతిరోజు ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం వచ్చి వెళ్లేటపుడు వేలిముద్రలు బయోమెట్రిక్‌ పద్దతిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్దతి వల్ల అధికారులు సమయాన్ని పాటిస్తారని ప్రభుత్వం ...

Read More »

వ్యాస రచన పోటీలు

  ఆర్మూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో పౌరసమాచార ఉత్సవాల సందర్భంగా శనివారం మధ్యాహ్నం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించినట్టు ఎంఇవో రాజగంగారాం శనివారం తెలిపారు. ఈనెల 7,8,9 తేదీల్లో పౌర సమాచార ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 8,9 తరగతులు చదివే విద్యార్థులకు ప్రస్తుతం తగ్గుతున్న నీటి వనరుల పరిష్కార మార్గాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.

Read More »

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు 766 దరఖాస్తులు

  ఆర్మూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా తీసుకున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి శనివారం నుంచి దరఖాస్తులను తహసీల్దార్‌ శ్రీధర్‌ స్వీకరించారు. అందులో మామిడిపల్లి గ్రామానికి 50 దరఖాస్తులు వచ్చినట్టు, పెర్కిట్‌కు సంబంధించి 200, ఆలూరు గ్రామానికి 201, దేగాం గ్రామానికి 6, ఆర్మూర్‌కు 309 మొత్తం 766 దరకాస్తులు వచ్చినట్టు తహసీల్దార్‌ వివరించారు. దరకాస్తులు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ...

Read More »

కారుపై డెడ్ బాడీ – కిలోమీటర్ జర్నీ

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న టూ వీలర్ ను ఢీ కొట్టింది ఓ కారు. ఢీకొట్టడమే కాదు… అలాగే దూసుకుపోయింది. అయితే దానిపై ఉన్న ఆ వ్యక్తి అలాగే ఎగిరి అదే కారుపై పడ్డాడు. అక్కడికక్కడే చనిపోయాడు. అయినా కారును ఆపకుండా దూసుకుపోయాడు డ్రైవర్. అలా కిలోమీటర్ దూరం పైనే వెళ్లిపోయాడు. అయితే దీన్ని గమనించిన స్థానికులు ఆ కారును వెంటాడి పట్టుకున్నారు. ఇన్సిడెంట్ కట్టంగూర్ దగ్గర జరగగా… ఐటిపాముల దగ్గర కారును పట్టుకున్నారు పోలీసులు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డ్రైవర్ ...

Read More »

బీన్స్‌తో బూందీ కూర

కావలసిన పదార్థాలు: బీన్స్‌ – పావుకిలో, బూందీ – ఒక కప్పు, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిరపకాయలు – రెండు, కారం – ఒక టీ స్పూను, పసుపు – చిటికెడు, ఆవాలు, జీలకర్ర – ఒక టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, వెల్లుల్లిరేకలు – నాలుగు, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా బీన్స్‌ని కుక్కర్లో ఒక విజిల్‌ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. తరువాత పొయ్యిమీద గిన్నె ...

Read More »

చివరి నిమిషం లో కిల్లింగ్ వీరప్పన్ రిలీజ్ కు బ్రేకులు పడ్డాయి..ఎందుకు..?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ రిలీజ్ కు మరో అడ్డంకి వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న రిలీజ్ అనుకుంటే రిలీజ్ కి వారం ముందు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి సినిమాపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేసింది. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది..ఆ తర్వాత డిసెంబర్ 18 అని ప్రకటించారు కానీ ఆ రోజు కూడా రిలీజ్ కాలేదు..అన్ని అడ్డంకులు తొలిగిపోయే ఫైనల్ గా జనవరి 1న రిలీజ్ అవుతుందని , ఆడియన్స్ టికెట్స్ కూడా బుక్ ...

Read More »

పెరిగిన నాన్-సబ్సిడీ వంటగ్యాస్ ధర

న్యూఢిల్లీ, జనవరి 1: నాన్-సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర శుక్రవారం 49.5 రూపాయలు పెరిగింది. అయితే నాన్-సబ్సిడీ కిరోసిన్ ధర మాత్రం లీటర్‌కు 1.05 రూపాయలు తగ్గింది. విమానయాన ఇంధనం (ఎటిఎఫ్) ధర కూడా 10 శాతం తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ఎటిఎఫ్ ధర 4,428 రూపాయలు దిగి 39,892.32 రూపాయలకు చేరింది. ఇదే క్రమంలో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర 657.50 రూపాయలుగా ఉంటే, లీటర్ కిరోసిన్ ధర 43.19 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ...

Read More »

దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ (డిఎస్‌ఎఫ్‌) 21వ ఎడిషన్‌ జనవరి 1న ప్రారంభమయ్యింది. ప్రతి సంవత్సరంలానే దుబాయ్‌ ఫెస్టివల్‌ ఈసారి కూడా బోల్డన్ని ఆఫర్లతో కొనుగోలుదారులకు సంబరాలను తీసుకొచ్చింది. ఆర్గనైజర్స్‌ దుబాయ్‌ ఫెస్టివల్స్‌ అండ్‌ రిటైల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డిఎఫ్‌ఆర్‌ఇ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ కమర్షియల్‌ మార్కెటింగ్‌ (డిటిసిఎం) గత సంవత్సరం డిఎస్‌ఎఫ్‌ బంపర్‌ డ్రా విజేతలు తాము గెలుచుకున్న బహుమతులు, వారి ఆనందాన్ని తెలుసుకుంది. ఫిలిప్పీన్స్‌కి చెందిన రోజ్‌ వినో, 350,000 దిర్హామ్‌లను గెలుచుకున్నారు. దాంతో వారు కొత్తగా కారు కొనుక్కోవడమే కాకుండా, ఆర్థికంగా ...

Read More »