Breaking News

Daily Archives: January 8, 2016

రక్ష స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తపరీక్ష శిబిరం

  ఆర్మూర్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మామిడిపల్లి గ్రామంలోగల విజయ్‌ హైస్కూల్‌లో ఈనెల 10 ఆదివారం రక్షా స్వచ్చంద సేవా సంస్థ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలోమెగా రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు కాందేశ్‌ శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిబిరంలో ప్రజలకు ఉచితంగా రక్త పరీక్షలు, థైరాయిడ్‌, షుగర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Read More »

ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధ్యులపై 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్‌

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక వివక్ష రూపుమాపేందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో జరిగిన జిల్లా స్థాయి విజిలెన్సు, మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలపై జరిగిన అత్యాచార సంఘటనలపై నమోదైన కేసులపై చేపట్టిన చర్యలను జిల్లాకలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార ...

Read More »

పిఆర్‌టియు క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ శుక్రవారం పిఆర్‌టియు క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పిఆర్‌టియు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు, పోచయ్య, ప్రతినిధులు గోవర్దన్‌, నర్సారెడ్డి, సిద్దిరాంరెడ్డి, బాల్‌రాజు, గణపతి, మధుసూదన్‌రెడ్డి, వీరేంద్రగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

తపస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఉపవిద్యాధికారి బలరాం శుక్రవారం తపస్‌ 2016 సంవత్సర కాలమాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తపస్‌ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరకానుకగా ఉపాధ్యాయులకు నగదు రహిత హెల్త్‌ కార్డులను జూలై 2015 డిఎను ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కామారెడ్డి మండల విద్యాధికారి రవింధర్‌ శర్మ, ఆంజనేయులు, భాస్కరాచారి, దత్తాచారి, లక్ష్మిపతి, రాంచంద్రం, లక్ష్మణ్‌రావు, రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

కరువు నిదులు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలి

  – సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కరువు నిదులు కేటాయించి ప్రజలను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో శుక్రవారం జరిగిన సిపిఐ డివిజన్‌ కార్యకర్తల సమావేశానికి బాల్‌రాజ్‌ అధ్యక్షత వహించగా, కంజర భూమయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరువు ఏర్పడ్డా కరువు నిధులు కేటాయించకుండా సవతి తల్లి ప్రేమ వహిస్తుందని ఆరోపించారు. ఆంద్రాకు ...

Read More »

ఘనంగా కామేశ్వరి, కామేశ్వరుల కళ్యాణం

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని హౌజింగ్‌ బోర్డుకాలనీలోగల శ్రీ శారదా శంకరాచార్య ఆలయంలో శుక్రవారం ఇష్ట కామేశ్వరి, కామేశ్వరుల కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రముఖ వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు. ఇందులో వివాహం కాని యువతీ, యువకులు పాల్గొని పార్వతి పరమేశ్వరులను పూజించి కానుకలు సమర్పించారు. ఈ కళ్యాణం ప్రతి మూలనక్షత్రంలో జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సతీష్‌ పాండే, సంతోష్‌ శర్మ, చంద్రశేఖర శర్మ, విజయ రాఘవ శర్మ, ...

Read More »

అక్షర టెక్నో స్కూల్లో సంక్రాంతి సంబరాలు

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టనంలోని అక్షర పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను విద్యార్థులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో బొమ్మరిల్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులతో వేడుకలు జరిపారు. సంప్రదాయ దుస్తులు ధరించి ముగ్గులు వేసి గాలిపటాలు ఎగురవేసి ఆడి పాడారు. విద్యార్థులకు రేగు పండ్లు పోసి పండగ సంప్రదాయాన్ని, విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఛైర్మన్‌ అశోక్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు హేమలత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Read More »

ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థిసేన ధర్నా

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం తెలంగాణ నవనిర్మాణ విద్యార్థిసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సేన డివిజన్‌ ఇన్‌చార్జి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌సిప్‌లు విడుదల చేయకపోవడంతో ఎంతో మంది పేద విద్యార్తులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో విద్యార్థులు కీలకపాత్ర పోసించారని, ప్రభుత్వం వారిని మరిచిపోయి విద్యార్థులపై అవలంబిస్తున్న తీరు శోచనీయమన్నారు. వెంటనే వాటిని విడుదల చేయాలని ...

Read More »

బల్దియా కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బల్దియాలో అవినీతి టెండరు విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ఇన్‌చార్జి కమీషనర్‌ పఠాభిలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు వి.ఎల్‌.నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా 2007లో అవినీతి టెండరు విధానాన్ని రద్దుచేసి కార్మికులకు తమ గ్రూపుల ద్వారా పనులను అప్పగించారన్నారు. 9 సంవత్సరాల నుంచి ...

Read More »

నలుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

  ఆర్మూర్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని ఫత్తేపూర్‌లో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్తావరంపై దాడిచేసి నలుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు ఆర్మూర్‌ ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు. పేకాట స్థావరం వద్ద 29820 రూపాయల నగదును, 4 మోబైల్‌ ఫోన్లను, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా పేకాట ఆడుతున్నారన్న సమాచారం తెలిస్తే దగ్గర్లోని పోలీసులకు తెలియజేయాలని, లేదా 100 నెంబరుకు డయల్‌ చేసి సమాచరం ...

Read More »

బీర్కూర్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకునే ‘అన్న’ ఎవరు…?

  బీర్కూర్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ రాజకీయాల్లో తలదూరుస్తున్న అధికార పార్టీకి చెందిన మండల నాయకుడు అన్న అనే వ్యక్తి జోక్యం అధికమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మొగులయ్య గ్రామసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు అన్న అనే వ్యక్తి ప్రబుత్వ సంక్షేమ పథకాల్లోను, ఫైరవీల్లోను తన పలుకుబడిని ఉపయోగిస్తున్నాడని, బీర్కూర్‌ గ్రామంలోని ఎంపిపి, ఎంపిటిసిలు, అధికారపార్టీకి చెందిన సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏంచేస్తున్నారని కోపోద్రిక్తుడయ్యాడు. గ్రామాభివృద్దికి గ్రామంలోని వ్యక్తుల జోక్యం ఉంటే ...

Read More »

ప్రాథమిక ఉప వైద్య కేంద్రం నిర్మించండి

  బీర్కూర్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో ప్రాథమిక ఉప వైద్య కేంద్రం నిర్మించేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఎన్‌ఎం సునిత అన్నారు. బీర్కూర్‌ గ్రామ పంచాయతీలో శుక్రవారం గ్రామసర్పంచ్‌ దూలిగ నర్సయ్య ఆద్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎం మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో ఉందని ఎక్కువ మంది రోగులకు ఉండడానికి సరిపోవు స్థలం లేదన్నారు.   నూతన భవన నిర్మాణం చేపడితే గ్రామంలో ఉపయోగకరంగా ...

Read More »

ఈనెల 11న ఎంపిక ప్రక్రియ

  ఆర్మూర్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పథకం ద్వారా 2015-16 సంవత్సరానికి వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఈనెల 11న సోమవారం ఉదయం 11.30 గంటలకు ఆర్మూర్‌ మునిసిపల్‌ కార్యాలయంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుందని ఆర్మూర్‌ పురపాలక కమీషనర్‌ సివిఎస్‌ రాజు శుక్రవారం తెలిపారు.

Read More »

ధోనీకి నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్

ఇండియన్ క్రికెట్ స్టార్ మహేంద్రసింగ్ ధోనీకి నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అనంతపురం జిల్లా కోర్టు. బిజినెస్ టుడే మేగజైన్ లో విష్ణుమూర్తి అవతారంలో ధోనీ ఉండటంపై గతంలో అనంతపురం జిల్లా కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు VHP నేత శ్యాం సుందర్. దీంతో కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపింది కోర్టు. అయితే ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాలేదు ధోనీ. నోటీసులు పంపినా కోర్టుకు హాజరుకాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం.

Read More »

మెదక్ లో రెండువర్గాల ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం

మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం.. తెర్లమద్దికి చెందిన శ్రీహరి టూవీలర్ తో స్థానిక సర్పంచ్… లక్ష్మిని ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర స్థాయిలో ఆవేశంతో ఊగిపోయిన ఆమె కుమారులు శ్రీహరిపై దాడి చేశారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు శ్రీహరి. సర్పంచ్ లక్ష్మి కుమారులు కొట్టడంతోనే చనిపోయారని ఆరోపిస్తూ శ్రీహరి బంధువులు సర్పంచ్ ఇంటిముందు డెడ్ బాడీతో నిరసనకు దిగారు. ఆగ్రహంతో సర్పంచ్ ఇంటికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ...

Read More »

దావూద్ హోటల్ అమ్ముడవ్వలేదు

ముంబైలో ఉన్న దావూద్ ఆస్తుల వేలం మళ్లీ మొదటికి వచ్చింది. గత డిసెంబర్ లో జరిగిన వేలంలో దక్షిణ ముంబైలోని పాక్మోడియా స్ట్రీట్ లో ఉన్న దావూద్ హోటల్ రౌనక్ ఆఫ్రోజ్ ను సొంతం చేసుకున్నారు మాజీ జర్నలిస్టు బాలకృష్ణన్. స్మగ్లర్ అండ్ ఫారిన్ ఎక్స్ ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ -1976 కింద సైఫీ బుర్హానీ అప్ లిఫ్ట్ మెంట్ ట్రస్ట్ ఈ వేలాన్ని నిర్వహించింది. మొత్తం 4 కోట్ల 28 లక్షలకు దక్కించుకున్నారు బాలకృష్ణన్. కానీ ఆయన ఆ డబ్బులను వేలం సంస్థకు ...

Read More »

ఒమాన్ ” ఇ – 44″ మార్గంలో ఇక విదేశీయులకు అనుమతి లేదు

ఎమరేట్స్ నుంచి భూమార్గం ద్వారా ఒమాన్ చేరేందుకు ఫీజులను క్రమబద్దీకరించారు. దీని   ప్రకారం ఒక వ్యక్తికి 30  దినార్లు ఖర్చుగా నిర్ణయించారు. ఈ మార్గంలో గల్ఫ్ దేశాల సమఖ్యకు చెందిన జాతీయులు ఈ రహదారి మీదుగా తమ తమ ప్రయాణాలను కొనసాగించవచ్చు. అయితే , ఇదే మార్గంలో ప్రయాణించే  విదేశీయులకు అనుమతి లేదు. ఈ దారి ఒమాన్  సరిహద్దు  ప్రాంతమైన మాదం మరియు హత్తాకు చేరుతుంది. ఈ మార్గానికి ప్రత్యామ్నయంగా షార్జా  కల్బ మీదుగా హత్తాకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు ...

Read More »

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి సూసైడ్

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్ కరోలీ యూనివర్సిటీలో ఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివకిరణ్.. తన హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకున్నాడు. శివకిరణ్ రామంతాపూర్ లోని ఇందిరానగర్ వాసి. తండ్రి ఉమాశంకర్.  హైదరాబాద్ లో ఐఐటీ పూర్తి చేసిన శివకిరణ్.. ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్లాడు. అయితే ఫస్ట్ ఇయర్ లో అనుకున్న ర్యాంక్ రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

Read More »

భూతాపం తగ్గించడమే లక్ష్యం!

భారత్‌ ప్రతిష్ట మరోసారి అంతర్జాతీయ చిత్రపటంపై మారుమోగుతోంది. పర్యావరణ పరిరక్షణ, వాతా వరణకాలుష్యాన్ని నివారించేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని కాప్‌ 21 సదస్సు భూతా పాన్ని రెండుశాతం తగ్గించేందుకు ఏకగ్రీవంగా ఆమోదించింది. మొత్తం 195 దేశాలుపాల్గొన్న ఈసమావేశంలో ఒప్పంద ముసాయిదాను సమగ్ర పరిశీలన అనంతరం అంతర్జాతీయ పర్యావరణ సదస్సు(కాప్‌-21) ఆమోదముద్రవేసింది. వర్ధమాన దేశాలు 1.5డిగ్రీల సెల్షియస్‌కు తగ్గించాలన్న ప్రతిపాదనపై చొర చూపేందుకు సైతం ముందుకురావడం ప్రపంచపర్యావరణ పరి రక్షణ, వాతావరణంలో హానికారకఉద్గారాలను తగ్గించేందుకు అంతర్జాతీయంగా ఒకేవేదికనుంచి కృషిచేసేందుకుమార్గం సుగ మమం అయింది. భూతాపం తగ్గింపు, ...

Read More »