Breaking News

Daily Archives: January 9, 2016

అవినీతికి పాల్పడిన సర్పంచ్‌పై చర్య తీసుకోవాలి

  నందిపేట, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌, గ్రామ కార్యదర్శులు, సిబ్బందిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని నందిపేట ఎంపిటిసి గాండ్లనర్సుబాయి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నందిపేట గ్రామ పంచాయతీని అక్రమాలకు అడ్డాగా మార్చిన షాకీర్‌, కార్యదర్శి శంకరయ్య, శేఖర్‌రెడ్డి, సిబ్బంది కలిసి దొంగ రసీదు పుస్తకాలు సృస్టించి అక్రమ సంపాదనకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాల్సిందిగా డిఎల్‌పివో, డిపివోకు ఫిర్యాదు చేసినా విచారణలో జాప్యం చేయడం విచారకరమన్నారు. మండల అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ...

Read More »

భక్తులతో కిటకిటలాడిన నర్సింహస్వామి ఆలయం

  ఎడపల్లి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జాన్కంపేట శివారులోని కొండల నడుమ వెలసిన శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. అమావాస్య సందర్భంగా జిల్లాయేతర ప్రాంతాల నుంచి, అలాగే పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. శనివారం అమావాస్య కావడం వల్ల దక్షిణభారత దేశంలోనే ఏకైక అష్టముఖి కోనేరు జాన్కంపేట నర్సింహస్వామి దేవస్థానం వద్ద వెలిసి ఉంది. ఓం ...

Read More »

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం దరఖాస్తులు

  ఆర్మూర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని తహసీల్‌ కార్యాలయంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లకోసం అర్హుల వద్ద నుంచి దరఖాస్తులు తహసీల్దార్‌ శ్రీధర్‌ స్వీకరిస్తున్నారు. స్వీకరించిన దరఖాస్తులను విచారణ జరిపి అర్హులైన వారికి పథకం అందేట్లు చూస్తామని ఆయన తెలిపారు.

Read More »

మూడో రోజు కొనసాగుతున్న పౌర సమాచార ఉత్సవాలు

  ఆర్మూర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని జావిడ్‌మినీ స్టేడియంలో గత రెండ్రోజులుగా పౌర సమాచార ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు శనివారం ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు విద్యాసంస్థలు, దుకాణ సముదాయాల వారు స్టాల్ళు ఏర్పాటు చేసి ప్రదర్శనకు ఉంచిన వస్తువులను గురించి పర్యాటకులకు వివరించి విక్రయిస్తున్నారు. పౌర సమాచార ఉత్సవాలను తిలకించడానికి ప్రజలు భారీగా సందర్శించారు.

Read More »

బైక్‌- టిప్పర్‌ ఢీ : ఇద్దరు మృతి

  ఆర్మూర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఎదురుగా వస్తున్న టిప్పర్‌ బైక్‌ను ఢీకొనడంతో చేపూర్‌రవి, తలారి సత్యం అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్మూర్‌ నుంచి నిజామాబాద్‌ వస్తున్న టిప్పర్‌ అంబేడ్కర్‌ చౌరస్తా మలుపు వద్ద బైక్‌ను ఢీకొనడంతోఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. శవాలను ఆసుపత్రికి తరలించారు.

Read More »

రాళ్ళవాగు భూముల పరిశీలన

  కమ్మర్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోనాపూర్‌ రాళ్ళవాగులో ముంపునకు గురైన భూములకు ఎగువ భాగంలో నిరుపయోగంగా మారిన రైతుల భూములను ఆర్డీవో యాదిరెడ్డి శనివారం పరిశీలించారు. రాళ్లవాగు ప్రాజెక్టులో నీటి నిలువ మూలంగా ప్రాజెక్టు ఎగువ భాగంలో 24 ఎకరాల రైతుల భూములకు వెళ్లలేని పరిస్తితి ఏర్పడింది. దీంతో ఆర్డీవో ఈ భూములను పరిశీలించి చర్చించారు. నిరుపయోగంగా మారిన తమ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ఆర్డీవోను కోరారు. సమస్యను ఉన్నతాదికారులకు వివరిస్తామని ఆర్డీవో తెలిపారు. ...

Read More »

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

  బోధన్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శనివారం ఫ్యాక్టరీ ముందు కార్మికులు ధర్నా చేశారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా నిజాం చక్కర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడుపుతామని హామీ ఇచ్చి ప్రస్తుతం మాట మార్చడం అన్యాయమన్నారు. కర్మాగారం లే ఆఫ్‌ ప్రకటించడం కార్మికులకు ద్రోహం చేయడమేనన్నారు. ఇటీవల కార్మికులు హైదరాబాద్‌లో ఆందోళనలు చేయడం జరిగిందన్నారు. కార్మికలకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు పోరాటం ...

Read More »

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

  సదాశివనగర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాగునీటిపై చర్యలు తీసుకుంటామని జడ్పి సిఇవో మోహన్‌లాల్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంతోపాటు రామారెడ్డి గ్రామంలోనీటి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన బోరుబావులను తవ్వించడానికి అనుమతి లేదని, పాత బోరుబావుల్లోనే ప్లషింగ్‌ చేయించాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక నిధుల ద్వారా తాగునీటి సమస్య పరిష్కరించేవిధంగా చూస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి బంజ విజయ శివకుమార్‌, జడ్పిటిసి రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు శైలజ, గంగామణి, కార్యదర్శి ...

Read More »

భక్తి శ్రద్దలతో ఎలమాస పండగ

  బిచ్కుంద, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భక్తిశ్రద్దలతో అక్కడ ధాన్యలక్ష్మిని కొలుస్తారు. సుభిక్షంగా పంటలు పండి అందరు చల్లగా ఉండాలని వేడుకుంటారు. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే అందమైన పండగ. వివరాల్లోకి వెళితే …మండలంలోని రాజుల్ల, కల్లాలి, చిన్న జావడ, పెద్దజావడ, చిన్న దడ్గి, పెద్ద దడ్గి గ్రామాల్లో ఎలమాస పండగ శనివారం ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో వచ్చే అమావాస్య రోజున ఎలమాస పండగ జరుపుకోవడం ఆనవాయితీ. ఎలమాస రోజు రైతులందరు ...

Read More »

ఇసుక టిప్పర్ల పట్టివేత

  రెంజల్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి గ్రామం నుంచి బాసర వైపు అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను తాడ్‌బిలోలి గ్రామం వద్ద రెవెన్యూ సిబ్బంది పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించినట్టు ఎస్‌ఐ రవికుమార్‌ అన్నారు. పిడి యాక్టు అమల్లో ఉన్నా ఇసుకాసురులు అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని, కేసు నమోదు చేస్తామని అన్నారు. ఇసుక అక్రమ రవాణాకు నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

Read More »

సుంకెట్‌లో సిసి కెమెరాలు ప్రారంభం

  మోర్తాడ్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకెట్‌ గ్రామంలో శనివారం ఆర్మూర్‌ డిఎస్పీ ఆకుల రాంరెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి సిసి కెమెరాలు ప్రారంభించారు. జిల్లా పోలీసుశాఖ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు అన్నారు. సిసి కెమెరాల ఏర్పాటు వల్ల దొంగతనాలు, మద్యం సిట్టింగ్‌లు, పోకిరీలు, ఆకతాయిల బెడద నివారించవచ్చన్నారు. సిసి కెమెరాల సంరక్షణలో గ్రామస్తులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో స్తానిక సర్పంచ్‌ మధుసూదన్‌గౌడ్‌, ఎంపిటిసి శిరీష నవీన్‌గౌడ్‌, తెరాస నాయకులు ...

Read More »

మహిళల సంక్షేమానికి తెరాస కృషి

  మోర్తాడ్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి కృషి చేస్తుందని మోర్తాడ్‌ ఎంపిడివో రాజ్‌వీర్‌, ఎంపిపి కల్లడ చిన్నయ్య, ప్రోగ్రామ్‌ అధికారి నర్సయ్య పలువురు అన్నారు. శనివారం మండలంలోని ధర్మోరా గ్రామంలో స్థానిక సర్పంచ్‌ దుగ్గెర రాజేందర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెరాస ప్రభుత్వం స్వచ్చ భారత్‌ కింద మహిళల గౌరవం కాపాడేందుకు, అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ కృషి చేస్తుందని, మహిళలు తెరాస పథకాలను సద్వినియోగం ...

Read More »

వెజిటబుల్‌ ఆమ్లెట్‌

కావలసిన పదార్థాలు: గుడ్లు – నాలుగు, బీట్‌ రూట్‌ – ఒకటి(చిన్నది) క్యాప్సికమ్‌ – ఒకటి, క్యాబేజి తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి, టమోటాలు – రెండు, బీన్స్‌ – నాలుగు, పచ్చిమిరపకాయలు – ఆరు, కొత్తిమీర కట్ట – ఒకటి, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, నూనె – సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా కూరగాయ ముక్కల్ని కుక్కర్లో ఒక విజిల్‌ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి బాగా ...

Read More »

గల్ఫ్ వలసకార్మికులు ప్రవాసులు కారా?

రెండు దశాబ్ధాలపాటు దక్షిణాఫ్రికాలో గడిపిన జాతిపిత మహాత్మాగాంధీ 1915, జనవరి 9న ముంబాయికి తిరిగొచ్చారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఊరుగానీ ఊరు, దేశం గానీ దేశంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నిత్య జీవన పోరాటం చేసే ప్రవాస భారతీయులకు ఈ దేశం ఏమిచ్చిందన్న ప్రశ్నకు జవాబు కోసం వెతుక్కోవాల్సిందే. ఏడాదికొకసారి ఆర్భాటంగా ప్రవాస భారతీయ దివస్ పేరిట సందడి చేయటం మినహా విదేశాలకు వెళ్లిన భారతీయ మూలాలున్న వ్యక్తులకు భారత ప్రభుత్వం ...

Read More »

ఇంకిపోతున్న భూగర్భజలాలు

నీటి వనరులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. నీటి వనరులపై ప్రజలలో సరైన అవగాహన లేదు. ఈ స్థితి ఇలాగే కొనసాగితే భావితరాలకు నీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదంఉంది. ప్రభుత్వంతోపా టు ప్రజలు కూడా సహకరించి నిర్వహించాలి. నీరు మనకు ప్రకృతి ప్రసాదించినవరం. నీటిని వృధా చేయక ఉపయోగించుకొంటే అనేక లాభాలు కలుగుతాయి. పలు ప్రాంతాలలో తాగడానికి గుక్కెడునీళ్లు కూడా లభించక ప్రజలు ఇక్క ట్లకులోనవుతున్నారు. లక్షలాది ఎకరాలు నీటిసౌకర్యం లేక సాగుబడికి అనర్హమవుతున్నాయి.ప్రభుత్వం క్షామపరిస్థితుల్ని ఎదుర్కొవడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాత్కాలిక ...

Read More »