Breaking News

Daily Archives: January 16, 2016

ఘనంగా సంక్రాంతి పండగ

  కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ప్రజలు సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. మూడురోజుల పాటు బోగి, సంక్రాంతి, కనుమ పండగలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. ఇంటిముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. పండగ నేపథ్యంలో పట్టణంలోని ఆలయాలన్ని కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. గాలిపటాల పండగను కూడా యువత ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగు రంగుల గాలిపటాలు ఎగురవేస్తూ సంబరాలు జరిపారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు ఇళ్ళ ముందు సందడి చేశారు.

Read More »

ఆంజనేయస్వామికి సహస్ర తాంబూలార్చన

  కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని హౌజింగ్‌ బోర్డుకాలనీలోగల ఆంజనేయస్వామికి శనివారం సహస్ర తాంబూలార్చన జరిపారు. స్వామి జన్మనక్షత్రం కనుమ పండగ కలిసి రావడంతో 2500 తమలపాకులతో, లక్ష పువ్వులతో విశేష పూజలువైభవంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గంగవరం నారాయణ శర్మ, సతీష్‌ శర్మ, సంతోష్‌ శర్మ, ఆలయ కమిటీ బృందం మహిపాల్‌రెడ్డి, సాయిరెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైభవంగా అష్టోత్తర శత కళశాభిషేకం

  కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని శారదా దేవి మందిరంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని శారదా సరస్వతి మాతకు అష్టోత్తర శత కళశాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పండగ కలిసి రావడంతో ఉత్తరాయణ పుణ్యకాలంలో అష్టోత్తర శత కళశాభిషేకం, శతాధార పూరకంగా నిర్వహించినట్టు వేదపండితులు గంగవరం నారాయణ శర్మ తెలిపారు. కార్యక్రమంలో ఆంజనేయశర్మ, సతీష్‌ శర్మ, సంతోష్‌ శర్మ, దేవాలయ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రమాదవశాత్తు విఆర్వో మృతి

  కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్న చక్రి నాగరాజు (45) విఆర్వో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు బాత్‌రూంలో పడి మృతిచెందినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. నాగరాజు మండలంలోని కన్నాపూర్‌ గ్రామ విఆర్వోగా పనిచేస్తున్నాడు. మృతుని భార్య సిద్దమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నట్టు తెలిపారు.

Read More »

ఆదివారం నుంచి పల్స్‌పోలియో

  రెంజల్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం 17వ తేదీ నుంచి పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు సూపర్‌వైజర్‌ రమేశ్‌ తెలిపారు. రమేశ్‌ కథనం ప్రకారం… మండలంలో 24 పల్స్‌ పోలియో బూత్‌లు, రెండు బస్టాండ్‌ కేంద్రాలు, మోబైల్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 110 మంది సిబ్బంది పల్స్‌పోలియోలో భాగస్వాములవుతారని అన్నారు. 4760 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్టు ఆయన వివరించారు.

Read More »

18 నుంచి శిక్షణ తరగతులు

  రెంజల్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 18 వతేదీ నుంచి 25 వరకు గ్రామజ్యోతి సంఘాలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఎంపిడివో చంద్రశేఖర్‌ తెలిపారు. గ్రామజ్యోతి తరగతులకు సంఘాల సభ్యులు తప్పకుండా హాజరుకావాలని, వారంరోజుల శిక్షణలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పారు.

Read More »

మోర్తాడ్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

  మోర్తాడ్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని దళిత విద్యార్థులపై పెట్టిన అక్రమ ఆంక్షలను ఎత్తివేయాలని, అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌కు చెందిన పిహెచ్‌డి విద్యార్థులపై తప్పుడు ఆంక్షలు, బహిష్కరణలు కేంద్రప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని పాలెం అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ సంఘం, అంబేడ్కర్‌ సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ శనివారం మోర్తాడ్‌లోని జ్యోతిరావుఫూలే విగ్రహం ముందు ధర్నా, జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన అనంతరం జ్ఞాన భాండాగారాలుగా విరాజిల్లుతున్న యూనివర్సిటీలను ...

Read More »

మోర్తాడ్‌లో మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన ఉత్సవాలు

  మోర్తాడ్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌లో శుక్రవారం మండల దళిత ఐక్య పరిరక్షణ కమిటీ ఆద్వర్యంలో ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్‌పి జాతీయ అధ్యక్షురాలు మాయావతి 61వ జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాయావతి చిత్రపటం ముందు కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. బహుజనులు రాజ్యాధికారం వైపే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మోత్కు ముత్తెన్న, మామిడి భూమన్న, మల్లూరి రాజారాం, రవి, రామాయంపేట బూమన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read More »

చురుకుగా సాగుతున్న వాటర్‌ గ్రిడ్‌ పథకం సర్వే

  మోర్తాడ్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పథకం పైప్‌లైన్‌ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని సర్వే అధికారులు సంపత్‌, భాస్కర్‌, గోపిలు తెలిపారు. శనివారం మోర్తాడ్‌ జాతీయ రహదారి పాలెం క్రాస్‌ రోడ్డు వద్ద వాటర్‌ గ్రిడ్‌ సర్వే నిర్వహించారు. మండలంలోని తొర్తి, తిమ్మాపూర్‌, ధర్మోరా, షెట్పల్లి గ్రామాల సర్వే నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 20 మండలాల్లో పల్లవి కంపెనీకి చెందిన సర్వేయర్లు 14 బృందాలుగా ...

Read More »

90 టీడీపీ…బీజేపీ 60?

90 టీడీపీ…బీజేపీ 60? హైదరాబాద్: బీజేపీ- టీడీపీ కూటమిలో గ్రేటర్ ఎన్నికల పొత్తు ఖరారైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మొత్తం 150 డివిజన్లకు గాను 60 సీట్లు బీజేపీ, 90 చోట్ల టీడీపీ పోటీ చేయటానికి అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు రెండు పార్టీల నేతలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.నామినేషన్లు వేయటానికి ఆదివారం తుది గడువు కావటంతో ఈ రోజు రాత్రికే అభ్యర్థుల జాబితా పూర్తిస్థాయిలో వెలువడే అవకాశం ఉంది. పొత్తుపై ఇరు పార్టీలు ...

Read More »

కనుమ పండగ … “పశువుల పండుగ”

    కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. పశువుల పండుగ ముఖ్యంగా చిత్తూరుజిల్లా, అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది.  ఆ ...

Read More »