Breaking News

Daily Archives: January 29, 2016

రైతు మృతిపై అధికారుల విచారణ

బీర్కూర్‌: బీర్కూర్‌ మండలంలోని దామరంచ గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి అనే యువరైతు బుధవారం మృతి చెందాడు. రైతు మృతిపై శుక్రవారం రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా మృతుడి ఇంటికి వెళ్లి రైతు అప్పుల వివరాలు, మృతిచెందడానికి గల కారణాలను కుటుంబసభ్యులు, గ్రామపెద్దలను అడిగి తెలుసుకున్నారు. సహకార సంఘంలో రూ.67వేలు, ప్రైవేటు అప్పులు రూ.2లక్షల వరకు ఉన్నాయని నిర్థారించారు. విచారించిన నివేదికను జిల్లా కలెక్టర్‌ యోగితారాణాకు అందజేస్తున్నామని చెప్పారు. వారివెంట ఉపతహసీల్దారు వరప్రసాద్‌, ఏవో కమల, ఏఈవో శ్రావణ్‌, ఆర్‌ఐ ...

Read More »

మింగిన నిధులు కక్కాల్సిందే..!

న్యూస్‌టుడే-నిజామాబాద్‌ సిటీ : ఆసరా పింఛన్ల పంపిణీలో చేతివాటం ప్రదర్శించిన సిబ్బందికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖాతాలో జమచేయకుండా సొంతానికి వాడిన నిధులను తిరిగి రాబట్టే ప్రయత్నంలో ఉండడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలయ్యింది. ఈ వ్యవహారంపై జిల్లా పాలనాధికారిణి యోగితారాణా సీరియస్‌గా ఉండడంతో మింగుడు పడడం లేదు. ఆసరా లబ్ధిదారులకు చెల్లించకుండా ఉండిపోయిన నిధులను సిబ్బంది నుంచి రాబట్టలని నగర పాలక సంస్థ కమిషనర్‌తో పాటు ఆరుగురు ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుమారుగా రూ.11.34లక్షలను ఫిబ్రవరి 5వ తేదీ వరకు వసూలు చేయాలని ...

Read More »

ఫిబ్రవరిలో ‘బీసీ విద్యార్థి యువ గర్జన’

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరిలో ‘బీసీ విద్యార్థి యువ గర్జన’ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ యూత్‌ ఐకాస ఛైర్మన్‌ యెండల ప్రదీప్‌ తెలిపారు. గురువారం వర్సీటీలో యెండల ప్రదీప్‌ విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర బీసీ విద్యార్థి, యువ ఐకాస ఆధ్వర్యంలో బీసీల ఐక్యత, సమస్యల సాధనకు నిర్వహించే బీసీ విద్యార్థి యువ గర్జన విజయవంతం చేయాలని ప్రదీప్‌ కోరారు. ఈ సమావేశంలో బీసీ సెల్‌ డైరెక్టర్‌ డా. రమణాచారి, సీనియర్‌ అధ్యాపకులు ఎం. యాదగిరి, డా. పున్నయ్య, డా. రాంబాబు ...

Read More »

ఇంటి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలి

దేవునిపల్లి, న్యూస్‌టుడే: సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి అన్నారు. గురువారం కామారెడ్డి డివిజన్‌ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడారు. వంద శాతం పన్ను వసూళ్లపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో రూ.48.26 కోట్లకుగానూ గురువారం వరకు రూ.17.27 కోట్ల పన్నులు వసూలైనట్లు పేర్కొన్నారు. 25 గ్రామ పంచాయతీలో వంద శాతం పన్నులు వసూలు చేసినట్లు వివరించారు. గ్రామజ్యోతి పథకంలో 7 కమిటీలను శిక్షణ అందిచినట్లు పేర్కొన్నారు. గ్రామసభల ద్వారా 2016-17 సంవత్సరానికి తయారు ...

Read More »

సీఎం దిష్టిబొమ్మ దహనం

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): తెలంగాణ విశ్వవిద్యాలయంలో గురువారం ఎంఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. హెచ్‌సీయూలో రోహిత్‌ ఆత్మహత్య చేసుకుని రెండు వారాలు గడిచినా సీఎం కేసీఆర్‌ స్పందించకపోవడం తగదని వర్సిటీ బాలుర వసతి గృహం ఎదుట సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ఎఫ్‌ వర్సిటీ ఇన్‌ఛార్జి సంతోష్‌ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ దళితుల పట్ల వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు. రోహిత్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ స్పందించకపోవడం, కనీసం మీడియాతో మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు ...

Read More »

వసతి గృహ నిర్మాణ పనులు పరిశీలన

తెవివి క్యాంపస్‌, (డిచ్‌పల్లి, న్యూస్‌టుడే): తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్మిస్తున్న బాలుర వసతి గృహ భవన నిర్మాణ పనుల్ని గురువారం వీసీ పార్థసారథి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఇంజినీర్‌ వినోద్‌ను వీసీ అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, వచ్చే విద్యా ఏడాది మొదలయ్యే నాటికి వసతి గృహం పూర్తి చేయాలని వీసీ ఆదేశించారు. నాణ్యతతో పనులు చేపట్టాలని, విద్యార్థుల సౌకర్యమే పరమావదిగా ఉండాలని తెలిపారు. రూ. 13.5 కోట్ల వ్యయంతో 104 గదుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యం కోసం ...

Read More »

స్మగ్లర్ల ఉచ్చులో యువత

గాంధారి, సదాశివనగర్‌ పోలీసుఠాణాల పరిధిలో ఇటీవల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఉదంతాల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. సుమన్‌ అనే విద్యార్థి డిగ్రీ పూర్తి చేసి పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి శిక్షణ పొందుతున్నాడు. మరో విద్యార్థి ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. స్మగ్లర్లు సులువుగా డబ్బు సంపాదన మార్గాన్ని రుచి చూపడంతో వీరు కేసుల్లో ఇరుక్కుని ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. ఇదే దారిలో మరికొంత మంది యువత ఉండటంతో కామారెడ్డి డీఎస్పీ భాస్కర్‌ తీవ్రంగా పరిగణించి యువత స్మగ్లర్ల ఉచ్చులో పడకుండా నివారణ చర్యలు ...

Read More »

బియ్యం సన్నం… అన్నం దొడ్డు

న్యూస్‌టుడే, ఎల్లారెడ్డి : ఈ చిత్రంలో కనిపిస్తున్న మధ్యాహ్న భోజనం గండిమాసానిపేట ఉన్నత పాఠశాలలోనిది. ఇక్కడ విద్యార్థులకు సన్న బియ్యం వచ్చాయి. కానీ వంట చేస్తే మెతుకులు లావుగా మారడంతో పాటు అన్నం ముద్దలా అవుతోంది. దీంతో విద్యార్థులు తినడానికి ఇష్టపడటం లేదు. ఈ చిత్రంలో బియ్యంను చూపుతున్నది మత్తమాల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు అంజవ్వ. బియ్యం చూడటానికి సన్నగానే వస్తున్నాయని, వండితే మాత్రం లావుగా అవుతున్నాయని అయోమయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేద ...

Read More »

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ నవనిర్మాణ్‌ విద్యార్థి సేన ఆద్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం కామారెడ్డి సిఐ శ్రీనివాస్‌ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్‌ఐ శోభన్‌ మాట్లాడుతూ విద్యార్థి సేన ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి రంగ సమస్యలపై పోరాడుతూ సామాజిక సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సిఐగా ప్రశంసలు అందుకున్న శ్రీనివాస్‌రావును విద్యార్థి సంఘం డివిజన్‌ ఇన్‌చార్జి వినయ్‌కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »

నల్లబెల్లంపై ఆంక్షలు తొలగించాలి

  – సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నల్లబెల్లంపై ఆంక్షలు తొలగించి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నల్లబెల్లానికి మద్దతు ధర కల్పించాల్సిందిపోయి ఆంక్షలు విధించడం సరికాదన్నారు. రైతు పంటలకు మార్కెట్‌ కల్పించి మద్దతు దర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత కరువు పరిస్థితిలో ఆరుమాసాలు ప్రతి కుటుంబానికి 3 వేల చొప్పున కరువు ...

Read More »

డిగ్రీ కళాశాలలో న్యాక్‌ బృందం పర్యటన

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్‌ బృందం పర్యటించింది. కళాశాలకు న్యాక్‌ గుర్తింపు కేటాయింపునకు సంబంధించి గురువారం, శుక్రవారం న్యాక్‌ బృందం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాలను పరిశీలించారు. కళాశాల అధ్యయనంలో భాగంగా న్యాక్‌ బృందం ఇక్కడ పరిశీలిస్తుంది. బృందంలో ఆయా రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ ప్రొఫెసర్‌లు ఉన్నారు. బృందం ఛైర్మన్‌ శివసుబ్రహ్మణ్యం తోపాటు సమన్వయకర్త ప్రొఫెసర్‌ బిశ్వాల్‌రాయ్‌, ప్రొఫెసర్‌ జిల్సామ్‌ జాన్‌లు కళాశాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కళాశాల స్థితిగతులు, కళాశాలలోని ...

Read More »

ఆసుపత్రికి గోడగడియారం అందజేత

  నిజాంసాగర్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన కిషోర్‌ కుటుంబీకులు శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి గోడగడియారం అందజేశారు. వైద్యురాలు స్పందనకు గోడగడియారం అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి సత్యనారాయణ, గ్రామస్తులు సాయిలు, ఆసుపత్రి సిబ్బంది సుభాష్‌, కార్తీక, తదితరులున్నారు.

Read More »

నవోదయలో 9వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

  నిజాంసాగర్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహార్‌ నవోదయ విద్యాలయం నిజాంసాగర్‌లో 2016-17 విద్యాసంవత్సరానికి 9వ తరగతిలో పరిమిత ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ శోభన్‌బాబు తెలిపారు. 2015-16 విద్యాసంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తించబడిన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన అన్నారు. అభ్యర్థులు 01.05.2000 నుంచి 30.04.2004 లోపల జన్మించి ఉండాలని అన్నారు. దరఖాస్తు ఫారాలు ఉచితంగా జవహార్‌ నవోదయ విద్యాలయ కార్యాలయం నుంచి లేదా ఎన్‌విఎస్‌హెచ్‌క్యూ/ఓఆర్‌జి ...

Read More »

నెమ్లీ సాయిబాబా ఆలయానికి పాదయాత్ర

  మద్నూర్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్నూర్‌ మండల కేంద్రానికి చెందిన యువకులు శనివారం మద్నూర్‌ సాయిబాబా ఆలయం నుంచి బీర్కూర్‌ మండలం నెమ్లీ సాయిబాబా మందిరం వరకు పాదయాత్రగా బయలు దేరనున్నట్లు భక్తులు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు మద్నూర్‌నుంచి బయలుదేరనున్నట్లు వారు పేర్కొన్నారు. దాదాపు 70 మంది యువకులు పాదయాత్రలో పాల్గొననున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More »

ఐదుగురి బైండోవర్‌

  మద్నూర్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు ఐదుగురిని శుక్రవారం మండల తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేసినట్టు ఎస్‌ఐ కాశీనాథ్‌ తెలిపారు. బాలాజీ, ముసా, శ్రీకాంత్‌, మాధవ్‌, వీరేశంలను బైండోవర్‌ చేసినట్టు ఆయన వివరించారు. పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసు అధికారి ఆదేశానుసారం వీరిని పట్టుకొని బైండోవర్‌ చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వివరించారు.

Read More »

ఔషద మొక్కల పరిరక్షణలోనే భవిష్యత్తు

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఔషధ మొక్కల రక్షణ, వాటి పెంపకంతోనే మానవాళి ఆరోగ్య సంరక్షణకు భరోసా కల్పించవచ్చని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలోని బోటనీ విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరిగిన ఔషధ మొక్కల పరిరక్షణ – ఆరోగ్యం అనే అంశంపై జరిగిన సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఔషధ మొక్కల పెంపకం అత్యంత ఆవశ్యకమన్నారు. మన అడవులు ...

Read More »

ఎంఇవోకు సన్మానం

  పిట్లం, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని విద్యావనరుల కార్యాలయంలో శుక్రవారం తపస్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎంఇవో దేవిసింగ్‌ను ఘనంగా సన్మానించారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన సందర్భంగా అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తపస్‌ అధ్యక్షుడు కేతావత్‌ రమేశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఇవో మాట్లాడుతూ సమాజానికి ఉపాధ్యాయ వృత్తి ఎంతోఅవసరమని ఉపాధ్యాయులందరు సమయ పాలన పాటిస్తూ విద్యార్తులకు ఉత్తమ విద్యనందించాలని అన్నారు. కార్యక్రమంలో కృష్ణ, సంద్యారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

ఓటరు నమోదుపై అవగాహన

  పిట్లం, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటుకు అర్హతగల యువతీ, యువకులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని శుక్రవారం మండల కేంద్రంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రచార వాహనం మండల కేంద్రానికి చేరుకుంది. తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, ఏఎస్‌వో చారి తదితరులు మండల కేంద్రంలో ప్రతి కాలనీలో పర్యటించి ప్రజలకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు ...

Read More »

మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ

  నందిపేట, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో మహిళల కొరకు గత సంవత్సరం ప్రారంభించిన ఉచిత టైలరింగ్‌ సెంటరు ద్వారా 3 ల్యాబులు శిక్షణ పొందినట్టు జమాతె ఇస్లామి హింద్‌ మండల కన్వీనర్‌ శేఖ్‌గౌస్‌ మైనోద్దీన్‌ తెలిపారు. త్వరలో కొత్త బ్యాచ్‌ ప్రారంభించబోతున్నామని, ఆసక్తిగల వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 85000 61331 నెంబరులో సంప్రదించాలన్నారు. శిక్షణ కాలంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ...

Read More »

పరీక్ష కేంద్రం తనిఖీ

  డిచ్‌పల్లి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో పిజి రెగ్యులర్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్న కేంద్రాన్ని శుక్రవారం ఉదయం రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు రాస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం 8వ పరీక్షలు జరుగుతున్నరోజు మొత్తం 1386 మంది విద్యార్తులకు గాను 1315 మంది పరీక్షకు హాజరయ్యారు. రిజిస్ట్రార్‌ వెంట ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కనకయ్య, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రవీణాభాయి, తదితరులు ఉన్నారు.

Read More »