Breaking News

దేవాదాయ శాఖ డిప్యూటీ కార్యదర్శికి సన్మానం

వర్ని: మండలంలోని రుద్రూర్ గ్రామ మార్కండేయ ఆలయాన్ని రెవె న్యు, దేవాదాయ శాఖ డిప్యూటీ కార్యదర్శి రమేశ్‌గౌడ్ సోమవారం సం దర్శించారు. నిర్మాణంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి అందరూ సమ ష్ఠిగా కృషి చేయాలని సూచించారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎండోమెంట్ శాఖ ద్వారా ఆలయాలకు నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. రమేశ్ గౌడ్ రుద్రూర్ వాస్తవ్యుడు కావడంతో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తమ గ్రామస్తుడు రాష్ట్రస్థాయి అధికారి కావడం గర్వకారణంగా ఉం దన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గెంటీల సాయిలు, పప్పుల సురేశ్, వీరేశం తదితరులు పాల్గొన్నారు

Check Also

రుద్రూర్‌లో వ్యక్తి ఆత్మహత్య

వర్ని: మండలంలోని రుద్రూర్ గ్రామంలో లింగాల సాయిలు (48) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆదివారం ఇంట్లో దూలానికి ...

Comment on the article