Breaking News

రుద్రూర్‌లో వ్యక్తి ఆత్మహత్య

వర్ని: మండలంలోని రుద్రూర్ గ్రామంలో లింగాల సాయిలు (48) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆదివారం ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఏఎస్సై రజాక్ తెలిపారు. మృతుడి భార్య భూదేవి, పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సాయిలు వ్యవసాయ కూలీగా పనిచేస్తు జీవనాన్ని సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం ఉన్న ఒక్క కూతురుకు అప్పు చేసి వివాహం జరిపించాడు. కుటుంబం భారం అధిక మవ్వడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో కల్లుకు బానిసయ్యాడు. కొద్ది రోజులుగా కల్లులో కల్తీలేక పోవడంతో వింతగా ప్రవర్తించాడు. ఇటీవల కోలుకుంటున్న సమయంలో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఏఎస్సై పేర్కొన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కల్లులో కల్లీ లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు.

Check Also

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న ...

Comment on the article