Breaking News

Daily Archives: April 1, 2016

నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు ప్రశంసలు కురిపిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో జిల్లా అభివృద్ధిపై కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ మంచి పనులు చేశారు. కొందరు మీపై దుష్ప్రచారం చేశారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని అధిగమించిందని ప్రశంసించారు. రాష్ర్టాభివృద్ధి కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని కేంద్రం ప్రశంసించింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలి. రాష్ర్టానికి మంచి అభివృద్ధి ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ...

Read More »

జంలం పాఠశాల, అంగన్‌వాడి కేంద్రం తనిఖీ

  ఎడపల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని జంలం గ్రామంలో శుక్రవారం పాఠశాలను, అంగన్‌వాడి కేంద్రాన్ని ఎంపిపి రజిత యాదవ్‌, ఎంపిడివో రమాదేవి తనికీ చేశారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని నిర్వాహకులకు సూచించారు. సకాలంలో భోజనం అందించాలన్నారు. అదేవిధంగా అంగన్‌వాడి కేంద్రం తనిఖీలో బాలింతలకు పెట్టే భోజనం నాణ్యతతో ఉంచాలని అన్నారు. వారివెంట గ్రామస్తులున్నారు.

Read More »

రెడ్‌క్రాస్‌ ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

  ఎడపల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని సాటాపూర్‌ గేటు వద్ద శుక్రవారం రెడ్‌క్రాస్‌ ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎండలు మండుతుండడంతో ప్రయానీకుల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గఫర్‌మియా, నిర్వాహకులు మల్లెపూల శ్రీనివాస్‌, గంగాప్రసాద్‌, నీరడి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

డాక్టరేట్‌ సాధించిన ఆర్తీ, స్వప్నలను సన్మానించిన బిసి టీచర్లు

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బిసి టీచర్స్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో ఇటీవల డాక్టరేట్లు సాధించిన సిహెచ్‌ ఆర్తి, ఎన్‌.స్వప్నలను ఘనంగా సత్కరించారు. ఎకనామిక్స్‌ విభాగంలో పిహెచ్‌డి పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్వప్న, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పిహెచ్‌డి సాధించిన డాక్టర్‌ సిహెచ్‌.ఆర్తీలను అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శాలువా, పూలబొకేతో సభ్యులు సత్కరించి, వారిని అభినందించారు. అసోసియేషన్‌ అద్యక్షులు డాక్టర్‌ కె.రాజారాం మాట్లాడుతూ ఇద్దరు బిసి టీచర్లు ప్రతిష్టాత్మక సబ్జెక్టుల్లో పిహెచ్‌డి సాధించడం అసోసియేషన్‌కు గర్వకారణమన్నారు. ...

Read More »

సాధించాలన్న చొరవ, ఆకాంక్ష ఉంటే తప్పక విజయం వరిస్తుంది

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో సాధించాలన్న బలమైన ఆకాంక్ష, చొరవ ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం ట్రిప్‌ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్‌ వెల్పేర్‌ హాస్టల్‌కు చెందిన మొత్తం 20 మంది విద్యార్థులకు 21 రోజుల పాటు తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్‌ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రత్యేకత ...

Read More »

ఎక్సైజ్‌ సుంకాన్ని ఎత్తివేయాలి

  నందిపేట, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం బంగారు ఆబరణాలపై 1 శాతం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడాన్ని నిరసిస్తూ వెండి, బంగారు వర్తకులు చేపడుతున్న సమ్మె కొనసాగుతుంది. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని రెండురోజులు దుకాణాలు నడిపించినప్పటికి తిరిగి శుక్రవారం సమ్మెలో పాల్గొన్నారు. దుకాణాలు మూసి ఉంచి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వర్తకసంఘం ఉపాధ్యక్షులు సుదర్శన్‌ మాట్లాడుతూ తాము గత నెలరోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ...

Read More »

నీటి సమస్యపై కార్యదర్శి నిలదీత

  నందిపేట, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని మేజర్‌ గ్రామ పంచాయతీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీకి లక్షల రూపాయల ఆదాయమున్నా నీటి వనరులున్నప్పటికీ దానిని సద్వినియోగం చేయడంలో సర్పంచ్‌ షాకీర్‌, పాలకవర్గం విపలమైందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజలు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకర్లకు వచ్చే బోర్లకు మైనర్‌ రిపేర్లు చేయకపోవడంతో నీటి సరఫరా ఆగిపోయింది. నీటి ఎద్దడి ఏర్పడినప్పటికి పట్టించుకునే వారే లేరు. దీంతో ...

Read More »

రథయాత్ర విజయవంతం చేయాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125వ జయంతి సంవత్సర రథయాత్రను ఈనెల 3న ప్రారంభించనున్నట్టు జిల్లా వ్యాప్తంగా రథయాత్ర విజయవంతం చేయాలని రథయాత్ర కమిటీ ప్రతినిధులు కోరారు. శుక్రవారం వారు విలేరులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ రథయాత్ర ప్రారంభిస్తారన్నారు. రథయాత్ర జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గృహాలను సందర్శిస్తుందన్నారు. ఈ సందర్బంగా ఫూలే, అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని విద్యార్థులకు వివరిస్తారన్నారు. మహనీయుల జీవిత విశేషాలను ...

Read More »

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో జరగనున్న కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఎన్నికలను పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అనుసరించి నిర్వహించాలని ఆర్యవైశ్య ప్రతినిదులు శుక్రవారం ఎన్నికల అదికారి నాగేశ్వర్‌రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి సభ్యుడు పట్టణ సంఘానికి, 18 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాలోపు సభ్యులకు యువజన సంఘానికి ఓటు హక్కు కలిగించేవిధంగా సవరణ చేయాలన్నారు. ఓటరు జాబితాలో సైతం సవరణలు ...

Read More »

ప్రభుత్వ తీరుకు నిరసిస్తూ వ్యాపారస్తుల బంద్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉల్లిగడ్డలు పరిమితికి మించి నిలువ చేయకూడదని ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి డివిజన్‌లోని ఉల్లిగడ్డ, ఆలుగడ్డ హోల్‌సేల్‌, రిటేల్‌ వ్యాపారస్తులు బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోల్‌సేల్‌ వ్యాపారస్తులు 40 క్వింటాళ్ళు, చిన్న వ్యాపారస్తులు 3 క్వింటాళ్ళు మాత్రమే నిలువ ఉంచుకోవాలని ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతిరోజు సుమారుగా 800 నుంచి వెయ్యి క్వింటాళ్ళ వరకు ఉల్లిగడ్డ ...

Read More »

ఇందూరు తిరుమల ఆలయాన్ని సందర్శించిన సిఎం కెసిఆర్‌

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లిలో మాపల్లె చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నెలకొల్పిన ఇందూరు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మూెత్సవాల్లో భాగంగా మా పల్లె చారిటబుల్‌ ట్రస్టు ఛైర్మన్‌, ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు దంపతులు నిర్వహిస్తున్న శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తిలకించి, స్వామి వారి ఆశీస్సులు పొందారు. యాగశాల ప్రదక్షిణ చేసి, హారతి స్వీకరించారు. పర్యటనలో ...

Read More »

వాల్టాచట్టానికి తూట్లు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాల్టా చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రతి నిత్యం ఏదోఒకచోట భారీ చెట్లను నరికివేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. అటవీశాఖాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే చెట్లను నరికివేస్తూ తరలిస్తున్నారు. గతంలో మండలకేంద్రంలో బీట్‌ అధికారి కార్యాలయం ఉండడం వల్ల తరచూ తనిఖీలు నిర్వహించడం వల్ల ప్రజలు కొంత మేరకు భయముండేది. 20 సంవత్సరాల క్రితం మండల కేంద్రంలో అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో భవనం సైతం శిథిలావస్తకు ...

Read More »

మూడు నెలల కాలంలో 79 మంది భారతీయుల మరణాల నమోదు

ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో కతర్ లో మొత్తం 79 భారతీయులు మరణించాడు భారత దౌత్యకార్యాలయ ప్రదర్శనతో నమోదుకాబడింది. ఈ గురువారం నెలవారీ కమ్యూనిటీ పత్రిక ద్వారా ఈ సమాచారం బహిర్గతమైంది. 2014 మరియు 2015 మధ్య సమయంలో 279 మందిగా పైగా భారతీయులు కతర్ దేశంలో మరణించారు. దీనికి స్పందిస్తూ కతర్ లో అత్యవసరంగా దౌత్యాధికారి ఒక సమావేశం నిర్వహించారు. ఇందులో భారత జాతీయుల ఇబ్బందులు  మరియు కార్మిక సమస్యలు, వివిధ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ...

Read More »