Breaking News

Daily Archives: April 6, 2016

ముడుపులిస్తేనే పించన్‌ డబ్బులు…

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఆసరా పథకం పింఛన్‌ మోర్తాడ్‌లో పోస్టాఫీసు అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా అబాసు పాలైంది. బుధవారం మోర్తాడ్‌ పోస్టాఫీసు ముందు పించన్‌ లబ్దిదారులు ఎండలో పడిగాపులు కాశారు. పింఛన్‌ డబ్బులు అందించేందుకు అధికారులు, సిబ్బంది వేలిముద్రలు రావడం లేదని, నెట్‌వర్క్‌ పనిచేయడం లేదని, డబ్బులు అయిపోయాయని గత ఐదారురోజులుగా పోస్టాఫీసు చుట్టు తిప్పుతున్నారని లబ్దిదారులు పోస్టాపీసు ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ...

Read More »

రామన్నపేట్‌లో చలివేంద్రం ఏర్పాటు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రామన్నపేట గ్రామ బస్టాండ్‌ ప్రాంతంలో చలివేంద్రాన్ని స్తానిక సొసైటీ ఛైర్మన్‌ పిప్పరి లింబాద్రి, వైస్‌ఛైర్మన్‌ శోభన్‌రెడ్డిలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, గ్రామ ప్రజలకు , ప్రయాణీకులకు తాగునీరు అందించాలనే సంకల్పంతో సహకార సంఘం ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. సొసైటీ ఛైర్మన్‌లు, యువజన సంఘాల సభ్యులు స్వచ్చంద సేవా సంస్థలు అన్ని గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ...

Read More »

మిషన్‌ కాకతీయతోనే చెరువులకు మహర్ధశ

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు సాగునీరు అందించేందుకు, గ్రామస్తులకు తాగునీరు అందించేందుకు తెరాస ముఖ్యమంత్రి కెసిఆర్‌ మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రామన్నపేట గ్రామంలో ఉడికివాగు ప్రాజెక్టు, కుమ్మరి కుంట పనులను భూమిపూజచేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువులు, కుంటలు కనుమరుగయ్యాయని, కరువు ఏర్పడి బీడు ...

Read More »

నీటి ఎద్దడి తీర్చాలని ఆర్డీవోకు వినతి

  కామరెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలోని కాకతీయ నగర్‌ కాలనీలో నెలకొన్న నీటి ఎద్దడిని తీర్చాలని బుధవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో కాలనీ వాసులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ నగర్‌లోని వీరబ్రహ్మేంద్ర కాలనీ ప్రాంతంలో 30 కుటుంబాలకు పైగా ఉంటున్నామన్నారు. గత ఆరురోజులుగా ట్యాంకర్‌ సైతం రాకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేకు, సర్పంచ్‌కు విన్నవించగా ట్యాంకర్‌తో నీటి సరఫరా ...

Read More »

చలివేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ ప్రారంభించారు. రుద్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కామారెడ్డి ఎలక్ట్రానిక్‌ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. వేసవి నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి యజమాని చాట్ల శ్రీశైలం, మీడియా ప్రతినిధులు భాస్కర్‌, ...

Read More »

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని లయోలా పాఠశాల వద్ద గల పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. దీంతోపాటు 33వ వార్డులో పాత హనుమాన్‌ వీధిలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీనాయకులు మాట్లాడుతూ దేశ అభ్యున్నతి కోసం నరేంద్రమోడి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్దిని కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ప్రజలకు అభివృద్ది గురించి వివరించాల్సిన అవసరముందని చెప్పారు. ...

Read More »

ఈ-కామర్స్‌ వర్క్‌షాప్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 20న తెలంగాణ యూనవర్సిటీ కామర్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ కామర్స్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్టు కన్వీనర్‌ డాక్టర్‌ జి.రాంబాబు తెలిపారు. కాగా బుధవారం వర్క్‌షాప్‌కు సంబంధించిన పోస్టర్లను, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాంబాబు మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా ఈ కామర్స్‌లో వస్తున్న మార్పులు, వాటి ఉపయోగాలు వివిద ఈ కామర్స్‌ కంపెనీల నుంచి వస్తున్న వక్తలు వివరిస్తారన్నారు. వర్క్‌షాప్‌ కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ...

Read More »

నాడు నిండుగా… నేడు ఎడారిగా…

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంజీర పరివాహక ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటి కోసం విలవిలలాడుతున్నారు. మొన్నటి వరకు నీటితో కళకళలాడిన జీవనధార నేడు బీటలు వారి వెలవెలబోతోంది. సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో పరివాహక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కిలోమీటర్ల వెళ్ళి తాగునీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా ప్రజల దాహాన్ని తీర్చే మంజీర నీరు గొంతెడారిగా ఎప్పుడు నీటితో నిండు కుండల కళకళలాడుతూ కనిపించే జీవధార నేడు నీరులేక ఎడారిని తలపిస్తుంది. చుక్కనీరు ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ళ ఎంబిఏ కోర్సు

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో వ్యాపార నిర్వహణ విభాగంలో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు నిర్వహిస్తున్నట్టు ఎంబిఏ డీన్‌, హెచ్‌వోడి సత్యనారాయణ చారి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోర్సుద్వారా వ్యాపార, వాణిజ్య నిర్వహణ రంగంలో ముఖ్యంగా బహుళజాతి సంస్థలలో మేనేజర్‌గా, వ్యాపారవేత్తలుగా, పరిశోధన రంగంలో విరివిగా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కోర్సు కొత్త ట్రెండ్‌ సాగుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్సుకు కనీస విద్యార్హత ...

Read More »

రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

  రెంజల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితం తప్ప చేతల్లో చేసిందేమి లేదని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడ్‌బిలోలిలో విలేకరులతో మాట్లాడారు. గతంలో హామీ ఇచ్చిన తెరాస ప్రభుత్వం పనులు ఆచరణలో లేవన్నారు. ఉపాధి కూలీలు గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, సకాలంలో పనులు ప్రారంభించాలని ఆయన అన్నారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని, ఉపాధి పనులు కల్పించైనా వారిని ఆదుకోవాలన్నారు. వేసవి దృష్టిలో ఉంచుకొని ...

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

  రెంజల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన యూత్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు సిద్ద సాయిలు తండ్రి గత వారం రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. కాగా ఆయన కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయాడని, ఆ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. సుదర్శన్‌రెడ్డి వెంట జడ్పిటిసి నాగభూషణం రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సాయిరెడ్డి, నర్సయ్య, ప్రవీణ్‌, కార్తీక్‌, రమణ, తదితరులున్నారు.

Read More »

2016-17 కు రూ. 6030 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుణ వితరణలో ఉదారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ అభివృద్ది పథకాల అమలుకు చోదకులుగా నిలువాలని బ్యాంకర్లకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సిబ్బంది కొరత, సాంకేతిక పరమైన అంశాల వలన సామాన్య ప్రజలు ఇబ్బంది పడరాదని అభిప్రాయపడ్డారు. బుధవారం స్థానిక ప్రగతిభవన్‌లో సంయుక్త కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో 2016-17 కు రూ. 6030 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించి విడుదల ...

Read More »

141వ రోజుకు ఫ్యాక్టరీ కార్మికుల దీక్షలు

  బోధన్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాదీనం చేసుకొని నడిపించాలని కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 141వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ కార్మికులు దశరథ్‌, పోశెట్టి, ఎ.మల్లేశం, భవన భుషి, జి.అంజయ్యలు దీక్షలో కూర్చున్నారు. దీక్షలను సిపిఐ నాయకులు షేక్‌బాబు ఉద్యమకారులను పూలమాలలువేసి ఆహ్వానించారు. దీక్షా శిబిరాన్ని రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవులు, కార్యవర్గ సభ్యులు హన్మంత్‌రావు, ...

Read More »

తెగబడ్డ చైన్ స్నాచర్లు..బలైన పసికందు

హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్‌లు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా నగరంలోని నేరేడ్ మెట్ ఆర్కేపురంలో మరో దారుణం చోటు చేసుకుంది. పసికందును ఎత్తుకొని ఉన్న ఓ మహిళను టార్గెట్‌ చేసిన దుండగులు.. ఆమె మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చైన్‌ స్నాచర్‌లకు, మహిళకు మధ్య పెనుగులాట జరిగింది. దుండగులు కత్తితో దాడి చేయడంతో 25 రోజుల పసికందుకు గాయాలయ్యాయి. మూడు తులాల గొలుసుతో అగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన పసికందు గాంధీ హాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం ...

Read More »

ఐరోపా ద్వంద్వనీతి

భారత, ఐరోపా సమాఖ్యల పదమూడవ వాణిజ్య శిఖర సమావేశం విఫలం కావడం ఆశ్చర్యకరం కాదు. ఇరవైతొమ్మిది దేశాల ఈ సమాఖ్య-ఐరోపా యూనియన్-తో మన వాణిజ్య సంబంధాలు, దౌత్య సంబంధాలు అంటీ ముట్టని రీతిలో సాగుతుండడం, ఏళ్ల తరబడి ఆవిష్కృతమవుతున్న అంతర్జాతీయ దృశ్యం. అందువల్ల సమాఖ్యతో మన ప్రభుత్వం కుదుర్చుకోదలచిన, విస్తృత వాణిజ్య పారిశ్రామిక భాగస్వామ్య వ్యవహారాల ఒప్పందం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో గురువారం జరిగిన సమావేశంలో కొలిక్కి రాకపోవడంలో వింత లేదు. ఈ విస్తృత వాణిజ్య, పారిశ్రామిక భాగస్వామ్య వ్యవహారాల ఒప్పందం-బ్రాడ్ బేస్డ్ ...

Read More »

సంప్రదాయ సమీక్ష

మహారాష్టల్రో 1956 నుంచి అమలులో ఉన్న హైందవ దేవాలయ ప్రవేశాధికార శాసనం-హిందూ ప్లేస్ ఆఫ్ వర్‌షిప్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్-లోని నియమావళిని అమలు జరపవలసిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంబాయి హైకోర్టు ఆదేశించడం ధార్మిక సంప్రదాయాల సమీక్షకు మరోప్రాతిపదిక! ఈ నియమావళిని కచ్చితంగా అమలు జరపనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిహెచ్ వాఘేలా, న్యాయమూర్తి ఎమ్‌ఎన్ సోనల్‌లు అధిష్ఠించిన ధర్మాసనానికి శుక్రవారం హామీ ఇవ్వవలసి రావడం విచిత్రమైన పరిణామం! ఈ చట్టం అరవై ఏళ్లుగా అమలు జరుగుతోంది. అలాంటప్పుడు అమలు జరుపుతారా ...

Read More »

సిరియాలో రసాయన దాడి కి పాల్పడ్డ ఐఎస్

ఐఎస్‌ ఉగ్రవాదులు ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా మస్టర్డ్‌ గ్యాస్‌ను ఉపయోగించినట్లు సిరియా అధికారిక మీడియా ఆరోపించింది. దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని డెయిర్‌ అల్‌జువర్‌ వైమానిక స్థావరాన్ని ఆక్రమించేందుకు ప్రభుత్వ దళాలపై జరిపిన దాడిలో దీనిని ఉపయోగించినట్లు సమాచారం. ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. దీంతో పాటు ఇరాక్‌, సిరియా దళాలను నాశనం చేసేందుకు ఐఎస్‌ క్రూడ్‌ నుంచి వచ్చే రసాయనాలతో బాంబులు తయారు చేసి వినియోగిస్తున్నట్లు సమాచారం.సోమవారం రాత్రి డెయిర్‌ అల్‌ జోవర్‌పై మస్టర్డ్‌ గ్యాస్‌ నింపిన రాకెట్లతో దాడి చేసినట్లు సిరియాకు చెందిన ...

Read More »

జగన్‌కు మరో ఝలక్… వైసీపీ గూడూరు ఎమ్మెల్యే జంప్… అంతా వెళ్లిపోతారా ఏంటి?

వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఝలక్ మీద ఝలక్ ఇస్తూనే ఉన్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా లోని గూడురు ఎమ్మెల్యే సునీల్ కూడా తెదేపా తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వెల్లడించాడు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించాడు. మరోవైపు ఇటీవలే వైసీపీకి ఝలక్ ఇచ్చి కండువా మార్చుకునేందుకు సిద్ధమైన నెం.2 నాయకుడు జ్యోతుల నెహ్రూ తను పార్టీ మారడానికి గల కారణాలను ...

Read More »

కేసీఆర్ గారూ.. హెల్ఫ్ చేయండి.. నా పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోయింది: మధుప్రియ

తెలంగాణ పోరాట సమయంలో ఉద్యమ గీతాలతో అబ్బురపరిచిన గాయని మధుప్రియ. ప్రస్తుతం ఈమె జీవితానికి సంబంధించిన అంశాలపై రచ్చ రచ్చ జరుగుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో టీవీ షోల్లో అలరించిన మధుప్రియ పాడిన ‘ఆడ పిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ’ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. గత ఆరు నెలల క్రితం శ్రీకాంత్ అనే యువకుడిని మధుప్రియ ప్రేమించి.. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. అయితే వీరిమధ్య తగాదాలు సోషల్ మీడియాలోనే కాకుండా మీడియా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త ...

Read More »

ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు… భారీ ఎత్తున డిస్కౌంట్లు

ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చూస్తోంది. వేసవి కాలం మొదలవడంతో అందరూ ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లను కొనేందుకు షాపింగ్ మాల్స్‌కు పయనమవుతున్నారు. అయితే సమ్మర్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇచ్చి కస్టమర్లను తమ వైపు లాక్కునేందుకు ఫ్లిప్‌కార్ట్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కూలింగ్ డేస్ పేరుతో డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. 19,490 రూపాయలకే సాన్సూయి ఎయిర్ కండీషనర్‌ను అందిస్తూ ఇతర ఈ-కామర్స్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది.

Read More »