Breaking News

పథకాల సద్వినియోగంతోనే ముందడుగు

డిచ్‌పల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్ర వేశపెడుతున్న పథకాలను గిరిజనులు క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని టీయూ రిజిస్ట్రార్ ఆచార్య లింబా ద్రి అన్నారు. బుధవారం ఇందల్వాయి తండాలో ప్రభు త్వ పాలనాశాస్త్ర విభాగానికి చెందిన 45 మంది విద్యార్థులు తమ స్టడీ టూ ర్‌లో భాగంగా ఇందల్వాయి తండాను సందర్శించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ లింబాద్రి, జడ్పీ సీఈవో మోహన్‌లాల్ తండాలో మొ క్కలు నాటారు.

అనంతరం వా టర్‌షెడ్ నిర్వహణపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. తం డాలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును సందర్శిం చి ఇరువురు బీపీ చెక్ చేయించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లింబాద్రి మాట్లాడుతూ ప్రతి గిరిజన విద్యార్థి ఉన్నత లక్ష్యంతో విద్యనభ్యసించి స్టేజ్‌మీద కూర్చుండే స్థాయికి ఎదగాలన్నారు. ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాటర్‌షెడ్, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్న బంజార డెవలప్‌మెంట్ సొసైటీ చైర్మన్ తారాచంద్‌నాయక్‌ను ఆయన అభినందించారు.

అనంతరం జడ్పీ సీఈవో మోహన్‌లాల్ మా ట్లాడుతూ ఇందల్వాయి తండాను స్టడీటూర్‌గా ఎంచుకోవడం అభినందనీయమని విద్యార్థులను ఆయన అభినందించారు. గిరిజనుల అభివృద్ధి, పర్యావరణం, స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలపై వివరించారు. అనంతరం రిజిస్ట్రార్ లింబాద్రి, మోహన్‌లాల్‌ను సర్పంచి పాశం కుమార్, తండా పెద్దలు సన్మానించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్‌పోగ్రాం ఆఫీసర్ డాక్ట ర్ రవీందర్‌రెడ్డి, అధ్యాపకులు రామలింగం, డాక్టర్ న ర్సయ్య, డాక్టర్‌ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవోలు మర్రి సు రేందర్, బి.చందర్‌నాయక్, సర్పంచి పాశం కుమార్, వైస్‌ఎంపీపీ ఎడపల్లి చిన్న ముత్తెన్న, ఉప సర్పంచి గం గాధర్, ఎస్‌పీహెచ్‌వో తుకారం రాథోడ్, డాక్టర్‌నాగేంద్రబాబు, హెల్త్ వర్కర్ రాజేందర్, సూపర్‌వైజర్ సులోచన, సి బ్బంది విమల, నిర్మల, తండా నాయకులు చం దర్‌నాయక్, నారాయణ, లక్ష్మణ్, సకారం, సామ్య ఉన్నారు.

ఆలయాల్లో పూజలు..
మండలంలోని ఇందల్వాయి గ్రామ పంచాయతీ పరిధి ఇందల్వాయి తండాలో బుధవారం ఉదయం జగదాంబదేవి, సేవాలాల్ మహరాజ్ ఆలయంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రిక్క లింబాద్రి, జడ్పీ సీఈవో మోహన్‌లాల్, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తం డాలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి న సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించి ప్ర సాదాలు స్వీకరించారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *