Breaking News

Daily Archives: April 9, 2016

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డులో శనివారం సిసి రోడ్డు నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిదులు లక్ష రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రగతి పనులు చేపడుతామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో తమవంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శశిరేఖ, దామోదర్‌రెడ్డి, ఎ.ఇ. గంగాధర్‌, నాయకులు పిప్పిరి వెంకటి, దయానంద్‌, కృపాల్‌, తదితరులు ...

Read More »

అంబేడ్కర్‌ సంఘం మండల అధ్యక్షుడుగా నీరడి రవికుమార్‌

  ఎడపల్లి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అంబేడ్కర్‌ సంఘం మండల అధ్యక్షునిగా నీరడి రవికుమార్‌ను ఎన్నుకున్నట్టు జిల్లా అధ్యక్షుడు జె.నారాయణ శనివారం తెలిపారు. పూర్తిస్థాయి కమిటీని త్వరలో ఎన్నుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. అదేవిధంగా ఈనెల 14న జరిగే అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను మండలంలో ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నీరడి రవికుమార్‌ను పలువురు అభినందించారు.

Read More »

ఐదుగురు పేకాట రాయుళ్ళ అరెస్టు

  బోధన్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను శనివారం అరెస్టు చేయడం జరిగిందని బోధన్‌ సిఐ వెంకన్న తెలిపారు. వారినుంచి 27 వేల 900 నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు సిఐ వివరించారు.

Read More »

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జిరాయత్‌నగర్‌లో మహిళా సంఘాల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వార్డు కౌన్సిలర్‌ కాందేశ్‌ సంగీత, శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. వివిధ పథకాలను వారికి వివరించారు. సమావేశంలో ఇవో రాజలింగం, ఆర్‌సి కమల, మహిళా సంఘం అధ్యక్షురాలు రుకుంబాయి, సాయమ్మ, వసంత, రాజవ్వ, ...

Read More »

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

  బోధన్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోదన్‌ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ నాయకులు షేక్‌బాబు డిమాండ్‌ చేశారు. బోధన్‌ పట్టణంలో మునిసిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షేక్‌బాబు మాట్లాడుతూ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి శక్కర్‌నగర్‌ చౌరస్తా, నర్సీరోడ్డు, రుద్రూర్‌ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే వేసవిలో ఎండతీవ్రతను దృస్టిలో పెట్టుకొని బోదన్‌ మునిసిపల్‌ అధికారులు ...

Read More »

ఆదర్శ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ గ్రామ ఆదర్శ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మున్నూరు కాపు సంఘం సభ్యులు శనివారం తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం సంఘ భవనంలో ఉగాది వేడుకలు జరుపుకొని అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు తెలిపారు. అధ్యక్షులుగా బొందెల శేఖర్‌, ఉపాధ్యక్షులుగా మెకానిక్‌ రాజు, కార్యదర్శిగా బొందెల రాజేశ్వర్‌, కోశాధికారిగా విజయ్‌కుమార్‌, సహాయ కార్యదర్శిగా ఉప్పల అశోక్‌, సలహాదారులుగా పుప్పాల శ్రీనివాస్‌, ఆటో శంకర్‌, ...

Read More »

ఈనెల 13న జిల్లా మానిటరింగ్‌ సమావేశానికి సభ్యులు హాజరుకావాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13న జిల్లాకేంద్రంలోని జడ్పిలో జరిగే జిల్లా మానిటరింగ్‌ సమావేశానికి బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోగల మానిటరింగ్‌ మండల కమిటీ సభ్యులు, ఎంపిపిలు హాజరుకావాలని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య శనివారం ఒక ప్రకటనలో కోరారు. జడ్పిలో జిల్లా మానిటరింగ్‌ సమావేశం ఎంపి కవిత ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని సభ్యులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Read More »

నర్సరీల్లో మొక్కలు సంరక్షించాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు ఎండబారినుంచి కాపాడాలని డ్వామా పిడి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని ఏర్గట్ల, మోర్తాడ్‌ గ్రామాల్లోగల నర్సరీలను సందర్శించారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం వర్షాలు కురిసిన వెంటనే ప్రతిరైతు వ్యవసాయ తోటల్లో, పంటపొలాల్లో మొక్కలునాటి పెంచేవిధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ముందస్తుగా మొక్కలుపెంచే రైతులనుంచి దరఖాస్తులు తీసుకొని మొక్కలు నాటి సంరక్షించేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఇజిఎస్‌ ...

Read More »

ఆదివారం బీర్కూర్‌ మండలానికి పోచారం రాక

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మండలంలోని పలు అభివృద్ది పనుల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొంటున్నారని మండల తెరాస అధ్యక్షుడు పెరక శ్రీనివాస్‌, ఎంపిపి మల్లెల మీన, హన్మంతు తెలిపారు. మొదట నసురుల్లా బాద్‌ గ్రామంలోగల ఊరచెరువులో 39 లక్షల వ్యయంతో చేపట్టనున్న మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించి, ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడతారు. అనంతరం తిమ్మాపూర్‌ గ్రామంలోగల పాతచెరువులో 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ...

Read More »

ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మిషన్‌ కాకతీయ

  – మంత్రి హరీష్‌రావు కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అభినందనలు వస్తున్నాయని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖామంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. శనివారం గాంధారి మండలం పేట్‌సంగం గ్రామంలోని మద్దుల చెరువు పనులను పరిశీలించారు. 39 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని చెరువు నుంచి రైతులు పొలాలకు తరలించడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ...

Read More »

ఈ బిడ్డింగ్‌తో జాతీయ స్థాయిలో పంటల విక్రయాలు

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు మేలైన ధర కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిడ్డింగ్‌ విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈనెల 14న అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లాలో పండించే పసుపునకు అంతర్జాతీయంగా మంచి పేరున్న దృష్ట్యా ప్రధాని నరేంద్రమోడి ఈనెల 14న నిజామాబాద్‌ పసుపు ...

Read More »

కనుచూపు మేరలో పచ్చదనం కరవు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరువు ప్రభావంతో మూగ జీవాలకు మేత కరువైంది. మండలంలోని ఆయా గ్రామాల్లో మేత లేకపోవడంతో మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. రెండేళ్ళుగా వర్షాలు కురియకపోవడంతో కనుచూపు మేరలో పచ్చదనం కనిపించడం లేదని, పశువుల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 70 వేల గొర్లు, మేకలు 50 వేలు, గేదెలు ఆవులున్నాయి. వీటిని ప్రతిరోజు మేత వేయడం యజమానులకు సవాలుగా మారింది. దిక్కుతోచని పరిస్తితిలో పలువురు పశువులను విక్రయిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ...

Read More »

మలుపులో మృత్యువు పిలుపు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బొగ్గుగుడిసే చౌరస్తా వద్దగల ప్రధాన కాలువ వంతెన సమీపంలో నిజాంసాగర్‌-కామారెడ్డి జాతీయ రహదారి పై ఉన్న మూల మలుపు ప్రమాదాలకు కారణమవుతుంది. ఇక్కడ ఎలాంటి సూచిక పలకలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకనైనా ఇలాంటి మూల మలుపుల వద్ద సంబంధిత అదికారులు సూచిక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

Read More »

వృధాగా వంట గదులు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకుల సౌకర్యార్థం కొత్తగా నిర్మించిన వంట గదులు నిర్లక్ష్యానికి నిలువుటద్దాలుగా మారాయి. ఇష్టానుసారంగా అడ్డదిడ్డంగా నిర్మించడంతో ప్రభుత్వం మంజూరు చేసిన లక్షలాది నిధులు దుర్వినియోగమవుతున్నాయి. మండలంలోని మర్‌పల్లి, హసన్‌పల్లి, గాలిపూర్‌, కోమలంచ, మహ్మద్‌నగర్‌ తదితర ఆయా పాఠశాలల్లో నిర్మించిన వంట శాలలు వృధాగా మారాయి. ఆయా పాఠశాలల్లో వంటశాలల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్‌విఎం ద్వారా 50 వేల వరకు మంజూరు చేసింది. ఈ ...

Read More »

రివ్యూ: సర్దార్‌ గబ్బర్‌సింగ్‌

నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, కాజల్‌, శరత్‌ కేల్కర్‌, ముఖేష్‌రుషి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, వూర్వశి, బ్రహ్మాజీ, పోసాని తదితరులు. కథ, స్క్రీన్‌ప్లే: పవన్‌ కల్యాణ్‌, మాటలు: బుర్రా సాయిమాధవ్‌, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, నిర్మాతలు: శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా, పవన్‌ కల్యాణ్‌, దర్శకత్వం: బాబి సంస్థ: నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటీవ్‌ వర్క్స్‌, విడుదల: 8 ఏప్రిల్‌ 2016 పవన్‌ కల్యాణ్‌ చిత్రాల్లోకెల్లా.. గబ్బర్‌సింగ్‌ ఓ మైలురాయి. అందులోని డైలాగులు, పవన్‌ ...

Read More »

‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో సీటుకోసం అభిమానుల మధ్య గొడవ

నెయిల్ కట్టర్‌తో దాడి… ఒకరి మృతి పావగడ (కర్ణాటక): తుమకూరు జిల్లా పావగడలో శుక్రవారం పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం విడుదల సందర్భంగా జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి  చెందిన  రాకేశ్(20), టీకొట్టు నిర్వాహకుడు రవి.. పవన్ అభిమానులు. వీరు మధ్యాహ్నం స్థానిక అలంకార్ థియేటర్‌లో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని చూసేందుకు వెళ్లారు. కుర్చీ కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రవి నెయిల్ కట్టర్‌కు ఉండే చిన్నపాటి చాకుతో రాకేశ్ ...

Read More »

ఓ పక్క దేశానికి రాజు మరో పక్క మెకానిక్!

బెర్లిన్: ఎవరైనా ఏకకాలంలో పరస్పర భిన్నమైన జీవితాలను గడపడం చరిత్రలోనే అరుదు. అందులో రాజభోగాలు అందుబాటులో ఉండే ఓ దేశానికి రారాజుగా, మరో దేశంలో కష్టపడి పనిచేసే కారు మెకానిక్‌గా జీవించడమనేది అసలు ఉండదు. కానీ పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశం రాజు సెఫాస్ కోసి బాన్సా, పార్ట్ టైమ్ రాజుగాను, జర్మనీలో ఫుల్‌టైమ్ కారు మెకానిక్‌గాను పనిచేస్తున్నారు. వృత్తికి అంకితమై పనిచేసే వ్యక్తిగా జర్మనీ కస్టమర్ల ప్రశంసలు అందుకుంటున్న బాన్సా, ‘స్కైప్’ ద్వారా రాజ్యపాలను కొనసాగిస్తూ ఘనా ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. జర్మనీలోని ...

Read More »

షార్టులు వేసుకురావద్దన్న ప్రొఫెసర్.. మరుసటి రోజు అమ్మాయిలందరూ షార్టుల్లో

ఈ మధ్య కాలంలో యూనివర్శిటీల్లో ఏదో ఒక వివాదంపై ఏదో ఒక రగడ జరుగుతూనే ఉంది. హెచ్ సీయూ, జెఎన్యూ, రీసెంట్ గా శ్రీనగర్ నిట్ తాజాగా బెంగళూరులోని లా యూనివర్శిటీలో మరో వివాదానికి తెర పడింది. ఈయూనివర్శిటిలో విద్యార్థినులకు, ప్రొఫెసర్ కు మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఒక అమ్మాయి తరగతికి షార్ట్ వేసుకొని వచ్చినందుకు ప్రొఫెసర్ సదరు విద్యార్ధినిని ఆక్షేపించారు. దీంతో ఆ అమ్మాయికి మద్దతుగా..మరుసటి రోజు తరగతి గదిలోని అమ్మాయిలందరూ షార్టులతో వచ్చారు. ప్రొఫెసర్ తీరును వ్యతిరేకిస్తూ.. తామేసుకున్న దుస్తుల ...

Read More »

ఇది వింటే గుండె ఆగిపోతుంది.. చచ్చిపోతారు కూడా..!

గుండెపోటు వల్ల ప్రపంచంలో యేటా కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. మరెంతో మంది వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఏ విషయాలు వినడం వల్ల గుండెపోటు వస్తుంది. ఎలాంటి విషయాలను విని జీర్ణించుకోలేక మరణం కూడా సంభవిస్తోంది.. అనే అంశాలపై చేసిన సర్వే శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. మనుషులు తమ జీవిత భాగస్వామిని కోల్పోయిన వార్తను వింటే తట్టుకోలేరనీ, అటువంటి సమయాల్లోనే వారికి గుండెపోటు వస్తుందని ఓ సర్వేలో తేలింది. యవ్వనంలో ఉన్న వారయితే తమ భాగస్వామి దూరమయిందన్న వార్త తెలిస్తే పిచ్చెక్కిపోతారట. ...

Read More »

‘సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ప్లాప్… పవన్ రెండు రూపాయల ఆర్టిస్ట్ !’

పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ నేడు థియేటర్లలో సందడి చేసింది. అయితే ఈ సినిమా టాక్‌పై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సూపర్ హిట్ అంటుంటే… మరికొందరు అట్టర్ ప్లాప్ అంటున్నారు. ఈ సినిమా హిందీలో కూడా విడుదలైంది. హిందీలో ఈ సినిమా ఓ పెద్ద ప్లాప్‌గా మిగిలిపోయిందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ కమాల్ ఖాన్ ట్వీట్ చేశాడు. పవన్ 2 రూపాయల స్టార్ అంటూ విమర్శించాడు. హిందీ సంగతి వదిలేసినా, తెలుగులో ఈ సినిమా టాక్‌కు సంబంధించిన రిపోర్స్ట్ తన ...

Read More »