Breaking News

సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి

డిచ్‌పల్లి : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దళిత పక్షపాతి అని దళిత సంఘాల ప్రజా ప్రతినిధులు ప్రశంసించారు. రాష్ట్ర రాజధానిలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ డిచ్‌పల్లిలోని దళిత సంఘాల ప్రజా ప్రతినిధులు ఆదివారం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల ఆనంద్, నీరడి పద్మరావ్ మాట్లాడుతూ కేసీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆలోచన ముఖ్యమంత్రికి రావడం గొప్పవిషయమని కొనియాడారు. సంక్షేమ పథకాలు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు.

మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే అంబేద్కర్ కాంస్య విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారం మరువలేనిదని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎడపల్లి చిన్న ముత్తెన్న, జిల్లా ఎస్సీ, ఎస్టీ సర్పంచుల ఫోరం కన్వీనర్ పాశం కుమార్, స్థానిక సర్పంచి తాండ్ర అంజయ్య, డీసీసీబీ డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, ధర్మారం ఉప సర్పంచి ఎడవెల్లి సోమనాథ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు శ్యాంసన్, నాయకులు అనిల్ కుమార్, మేకల సురేశ్, స్వామినాథ్, అబ్బులు, సాయన్న, దూస్‌గాం రామరాజు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *