Breaking News

దాడి ఘటనలో ఒకరి మృతి

నిజామాబాద్‌రూరల్ : రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన దాడి సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, రూరల్ పోలీసులు తెలిపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముదక్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామేశ్‌పూర్ తండాకు చెందిన రవి, భానులు నర్సింగ్‌పల్లి గ్రామానికి కూలి పని చేసుకునేందుకు ఇటీవల వచ్చారు. నివాస గుడిసె వేసుకునేందుకుగాను వారిద్దరూ కలిసి ఓ చెట్టును నరుకుతున్నారు. అదే సమయంలో గోసంగి వెంకటి అనే వ్యక్తి వచ్చి ఆ చెట్టు మా పరిధిలో ఉందని దాన్నెందుకు నరుకుతున్నారని అడ్డుపడ్డాడు. దీంతో వారిద్దరూ కలిసి అతడిపై దాడి చేశారు.

ఈ సంఘటనలో వెంకటి (38) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్రామంలో భిక్షాటన చేసి వచ్చి కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. భార్యా పిల్లలు గుండెలవిసేలా రోదించడం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. చెట్టు నరుకుతున్న వివాదం ఓ నిండు ప్రాణం తీసే పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ ఎస్‌హెచ్‌వో ముని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దాడి సంఘటన వివరాలను ఆయన ఆడిగి తెలుసుకున్నారు. వెంకటి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *