Breaking News

కెనడా ఆచార్యునితో ట్రిప్‌ విద్యార్థుల స్కైప్‌ సంభాషణ

 

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌ ట్రిప్‌ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న 20 మంది విద్యార్థులతో కెనడాలో కార్ల్‌టన్‌ యూనివర్సిటీలో చరిత్ర ఆచార్యునిగా పనిచేస్తున్న డాక్టర్‌ చిన్నయ్య జంగం ముఖాముఖి సంభాసించారు. ఆయన స్కైప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ట్రిప్‌ ఇంటర్న్‌లతో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఉపన్యాసించారు. జీవితంలో గొప్పగా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా డబ్బున్నోడే కానవసరం లేదని, దీక్ష, పట్టుదల లక్ష్యశుద్ది, ప్రణాళిక బద్దమైన కృషి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జీవితంలో ఇంజనీర్లు, డాక్టర్లుగా మాత్రమే కాకుండా, అనేక ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నారు. ప్రపంచం తొందరగా మారుతుందని, అన్నింటా పోటీ తీవ్రంగా ఉందన్నారు. మీరు మంచి నైపుణ్యాలతో పోటీ ప్రపంచంలో ముందుండాలని ప్రొఫెసర్‌ చిన్నయ్య సూచించారు. గొప్ప లక్ష్యాలు కలిగి ఉండాలని, యూనివర్సిటీ ఆచార్యులతో విజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆయన సూచించారు. ట్రిప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల మాట్లాడుతూ సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలోనే చదివి కెనడాలో ప్రొఫెసర్‌గా ఎదిగిన జంగం చిన్నయ్య జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని విజేతగా నిలిచారని, ఆయన ఆన్‌లైన్‌లో స్కైప్‌ ద్వారా ముఖాముఖి నిర్వహించడం గొప్పవిషయమన్నారు. ట్రిప్‌ విద్యార్థులతో ఆయన గొప్పస్ఫూర్తి నింపాడని అన్నారు. ట్రిప్‌ కార్యక్రమాన్ని తెయులో అన్ని విధాలుగా సహకరిస్తున్న విసి సి.పార్థసారధి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *