Breaking News

Daily Archives: April 12, 2016

ఆరునెలల్లో ప్యాక్టరీలు ప్రారంభించండి

  నందిపేట, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారులో స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ సెజ్‌ ద్వారా నిర్మిస్తున్న తెలంగాణ మొదటి మెగా ఫుడ్‌ పార్కు పనులను తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ స్తానిక వనరుల వినియోగం, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా మెగా ఫుడ్‌ పార్కు ప్రారంభించినట్టు తెలిపారు. దీనిద్వారా 12 వేల మందికి ఉద్యోగావకాశాలు, కోల్డ్‌ ...

Read More »

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

  రెంజల్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం రెంజల్‌ మండల మాల మహానాడు ఆధ్వర్యంలో మండల స్థాయిలో అంబేడ్కర్‌ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మండలంలోని రెంజల్‌, తాడ్‌బిలోలి, నీలా, దూపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పోటీలను ఎంఇవో సంజీవరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు సంతోష్‌, రమేశ్‌, పోశెట్టి, ప్రబాకర్‌, రవి, సాయిలు, తదితరులున్నారు.

Read More »

మహనీయుల జయంతి గోడప్రతుల ఆవిష్కరణ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న ఉస్మానియా యూనివర్సిటీలో టిఎస్‌ జేఏసి, బిసి జేఏసి ఛైర్మన్‌ యెండల ప్రదీప్‌, ఇతర నాయకుల ఆధ్వర్యంలో జరప తలపెట్టిన మహనీయుల జయంతి వేడుకల గోడప్రతులను తెలంగాణ యూనివర్సిటీ విజ్ఞానసౌధలో వైస్‌ఛాన్స్‌లర్‌ పార్ధసారధి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కనకయ్య, టూటా అధ్యక్షుడు మామిడాల ప్రవీణ్‌, పెద్దోళ్ల శ్రీనివాస్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యెండల ప్రదీప్‌ మాట్లాడుతూ బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థిని విద్యార్థులు వేల సంఖ్యలో ...

Read More »

జార్జిరెడ్డి 4వ వర్ధంతిసభ గోడప్రతుల ఆవిష్కరణ

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఉద్యమ నిర్మాత జార్జిరెడ్డి 44వ వర్ధంతి సభ గోడప్రతులను న్యూడెమోక్రసి కార్యాలయం కుమార్‌ నారాయణ భవన్‌లో పిడిఎస్‌యు నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్‌ మాట్లాడుతూ ఉస్మానియా పోరు కెరటం జార్జిరెడ్డి పిడిఎస్‌యు విద్యార్థి ఉద్యమానికి పునాది రాయి వేశాడని గుర్తుచేశారు. మతోన్మాద శక్తులు ఆయనను హత్యచేశారని, ఆయన మరణంతో విద్యార్థి ఉద్యమాన్ని నీరుగార్చాలని చూసిన మతోన్మాదుల ఆశలు నెరవేరలేవని చెప్పారు. ...

Read More »

14న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ను ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన 125వ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 13న ఐక్యరాజ్యసమితి ఆద్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి జరుపుకోవడం యావత్‌ భారతదేశం గర్వించదగ్గ విషయమని ఆర్మూర్‌ మండల అధ్యక్షులు గాలి పురుషోత్తం అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌ నడిబొడ్డున 36 ఎకరాల ప్రదేశంలో 125 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్మించడంపై ...

Read More »

కేదారేశ్వర ఆశ్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణవ్రతం

  నందిపేట, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆశ్రమంలో మంగళవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. సోమవారం ఎమ్మెల్యే పెళ్లిరోజు కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

  నందిపేట, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఐలాపూర్‌ గ్రామంలోని చంద్రమౌళీశ్వర ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు హోమం నిర్వహించి ఆహుతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహరాజ్‌, స్థానిక సర్పంచ్‌ మీసాల సుదర్శన్‌, జడ్పిటిసి డాంగే స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అలరించిన సాయి కిండర్‌గార్డెన్‌ వార్షికోత్సవం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సాయి కిండర్‌ గార్డెన్‌ పాఠశాల వార్షికోత్సవం ఆహుతులను విశేషంగా అలరించింది. ఉత్సవంలో చిన్నారి విద్యార్థులు పలు సినిమా గేయాలు, దేశభక్తి గేయాలపై చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయమైన బతుకమ్మ పాటలపై చిన్నారుల నృత్యాలు అలరించాయి. వారి ఆటపాటలు చూపరులను అబ్బురపరిచాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌, ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థుల భయాన్ని పోగొట్టేందుకు మాడల్‌ పరీక్ష

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో పరీక్షల పట్ల నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు మోడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్‌బాబు, డివిజన్‌ కార్యదర్శి అరుణ్‌లు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సాందీపని జూనియర్‌ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు మోడల్‌ పరీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పరీక్షలమీద భయాన్ని పోగొట్టేందుకు ఎంసెల్‌ మోడల్‌ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. దీంతోపాటు విద్యార్థులకు పరీక్షపట్ల అవగాహన కలుగుతుందన్నారు. మోడల్‌ ఎంసెట్‌ ప్రశ్నాపత్రాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య తయారుచేశారని చెప్పారు. ఎంసెట్‌ పరీక్షలో ...

Read More »

ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆర్టీసి ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట మంగళవారం కార్మికులు దర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థికపరమైన పెండింగ్‌ సమస్యలు ఇతర సర్వీస్‌ కండీషన్ల పరిష్కారానికి ధర్నా చేపట్టామన్నారు. 2012 నుంచి రావాల్సిన లోన్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, డిఎ ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు రాజయ్య, టిఎస్‌ ఆర్టీసి ప్రతినిదులు బి.ఎస్‌.గౌడ్‌, రాజేందర్‌, నాగరాజు, ఆర్‌.ఎస్‌.రెడ్డి, ...

Read More »

పాముకాటుతో వ్యక్తి మృతి

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో పాముకాటుతో వ్యక్తి మృతి చెందడంతో విషాదచాయలు నెలకొన్నాయి. ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి కథనం ప్రకారం… బరంగెడ్గి గ్రామానికి చెందిన పున్కంటి మాణిక్‌ (58) సోమవారం అర్ధరాత్రి పొలానికి మోటారు బోరువేయడానికి వెళ్ళిన సమయంలో పాము కాటు వేసిందన్నారు. విషయం కుటుంబీకులకు తెలపడంతో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించే సమయంలో మార్గమద్యలో మృతి చెందినట్టు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పంచనామా నిర్వహించామన్నారు.

Read More »

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం

  – ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ బీర్కూర్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గల తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. మండలంలోని దామరంచ, మంజీరా పరివాహక ప్రాంతంలోగల పిల్టర్‌ వాటర్‌బెడ్‌ను ఆయన పరిశీలించారు. మండలంలోగల ఆయా గ్రామాలకు ఫిల్టర్‌ వాటర్‌ సప్లయ్‌ చేయాల్సి ఉన్నా, మంచినీరు సరఫరా కాకపోవడంలో ఆంతర్యమేమిటని గుత్తేదారుతో అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్తితుల ధృష్ట్యా భూగర్భజలాలు అడుగంటిపోయాయని, దీనివల్ల గతంలో వేసిన ఆరుబోర్ల వల్ల మండలంలో ఆయా ...

Read More »

త్రివేణి రచనల్లో జీవనవాస్తవిక కనిపిస్తుంది

  – విసి పార్ధసారధి డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ సహాయ ఆచార్యులు డాక్టర్‌ త్రివేణి రచనల్లో తెలంగాణ వాస్తవిక జీవన చిత్రం ప్రతిబింబిస్తుందని విసి పార్ధసారథి అన్నారు. ఆమె రాసిన ఆరుపుస్తకాల ఆవిష్కరణ మంగళవారం తెవివి విజ్ఞానసౌధలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విసి పార్ధసారథి మాట్లాడుతూ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా ఎలా ఉంటుందో, ఈ ఆరు పుస్తకాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. డాక్టర్‌ త్రివేణిలో ఒక అధ్యాపకురాలు, అనువాదకురాలు, ...

Read More »

అర్ధాంతరంగా నిలిచిపోయిన బిటి రోడ్డు పనులకు మోక్షం కలిగేనా…?

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ నుంచి ఏర్గట్ల గ్రామం వరకు, మోర్తాడ్‌ జాతీయ రహదారి క్రాసింగ్‌ వద్దనుంచి పాలెం గ్రామం నుంచి తిమ్మాపూర్‌ వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గత ఏడాదిగా నిలిచిపోయిన పనులకు మంత్రి, ఎమ్మెల్యే రాకతో మోక్షం లభించేనా ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది పుష్కరాలు దృష్టిలో ఉంచుకొని బాల్కొండ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో అన్ని గ్రామాలకు నిధులు మంజూరు చేయించి బిటి రోడ్డు ...

Read More »

బుధవారం మోర్తాడ్‌కు మంత్రి రాక

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విచ్చేస్తున్నారని మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియా, సొసైటీ ఛైర్మన్‌ ఎలాల రాజేందర్‌ తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఒడ్యాట్‌ గ్రామంలో మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువు పునరుద్దరణ పనులు ప్రారంభిస్తారని, 12 గంటలకు మోర్తాడ్‌లో సహకార సంఘ బ్యాంకు నూతన భవనాన్ని ప్రారంభిస్తారని ...

Read More »

ట్రిప్‌ విద్యార్థులతో విసి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌ విద్యార్థులతో విసి సి.పార్ధసారధి మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి పరిశోధనాంశాలు, వారు తెలంగాణ యూనివర్సిటీలో గడుపుతున్న విధానాన్ని, భవిష్యత్‌ లక్ష్యాలు తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి మెంటార్‌ ఎవరు, వారు ఏ సబ్జెక్టులో పరిశోధనలు చేస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల్లో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని విసి సూచించారు. వారి అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా తమ విద్య కొనసాగించాలని విసి ...

Read More »

షిఫ్ చిప్స్

సీఫుడ్ వెరైటీస్ అంటే ఇష్టపడని వారు ఎవరుండరు? అలాంటి వారికోసం ఒక డిఫరెంట్ షిష్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. ఫిష్ అండ్ చిప్స్ కాంబినేషన్ రిసిపి అద్భుతమైన టేస్ట్ తో నోరూరిస్తుంటుంది. ఈ రిసిపి స్పెషల్ గా ఇంగ్లీస్ కంట్రీస్ నుండి సేకరించడం జరిగింది. ఇది సీఫుడ్ లవర్స్ కు అత్యంత ఇష్టమైన ఆహారం. ఈ డిష్ కు ముఖ్యంగా అవసరం అయినది చేపలు, కొన్ని మసాలా దినుసులు. ఈ రిసిపిని ఫిష్ అండ్ చిప్ అని పిలుస్తారు . దీన్ని డీప్ ఫ్రైడ్ ...

Read More »