Breaking News

వాలీబాల్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం

 

డిచ్‌పల్లి,  : ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాలీబాల్ టోర్నీ నిర్వహించగా, విజేతలకు రిజిస్ట్రార్ లింబాద్రి అధ్యక్షతన మంగళవారం బహుమతులను ప్రదానం చేశారు. టోర్నీ గెలుపొందిన మ్యాథమెటిక్స్ డిపార్ట్‌మెంట్ విద్యార్థులను అభినందించారు. రెండో బహుమతి ఎంసీఏ డిపార్ట్‌మెంట్ విద్యార్థులు గెలుచుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఆర్వో రాజారాం, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పంచరెడ్డి చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. విద్యార్థులను, క్రీడలు నిర్వహించిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు రాజ్‌కుమార్, శ్రీధర్, సాయి, భవన్‌సింగ్, ఓంకార్, శ్రీచంద్, సెల్వరాజ్, ప్రశాంత్, అశోక్, నరేశ్ పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *