Breaking News

20న ఈ – కామర్స్‌ వర్క్‌షాప్‌

 

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 20వ తేదీన ‘డైనమిక్‌ ఆఫ్‌ ఈ-కామర్స్‌’ అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు వర్క్‌షాప్‌ కన్వీనర్‌ డాక్టర్‌ రాంబాబు గోపిశెట్టి తెలిపారు. ఇంటర్నెట్‌ వ్యవస్థ ఎక్కువ మందికి అందుబాటులోకి రావడం ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఊపందుకోవడం, ఈ-కామర్స్‌ వాణిజ్యం అనూహ్యంగా విస్తరించిందని డాక్టర్‌ రాంబాబు అన్నారు.

ఈ విషయాలకు సంబంధించి కామర్స్‌ విద్యార్థులతో అవగాహన పెంచడానికి వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ఈ వర్క్‌షాప్‌, కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో జరుగుతుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డి.చెన్నప్ప ప్రధాన వక్తగా విచ్చేస్తారన్నారు. ముఖ్య అతిథిగా వైస్‌చాన్స్‌లర్‌ సి.పార్ధసారధి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యాదగిరి, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రొఫెసర్‌ సత్యనారాయణచారిలు పాల్గొంటారన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *