Breaking News

బుధవారం బోధన్‌లో ఎంపి పర్యటన

 

బోధన్‌, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గంలో బుధవారం నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత పర్యటించనున్నట్టు బోదన్‌ ఎమ్మెల్యే షకీల్‌ తెలిపారు. మండలంలోని పెంటాకుర్దు గ్రామంలో మిషన్‌ కాకతీయ రెండో విడతలో భాగంగా చెరువు పూడికతీత పనులను ఆమె ప్రారంభించనున్నట్టు తెలిపారు. అనంతరం కల్దుర్కి గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఎంపి ప్రారంభిస్తారు. అలాగే ఖండ్‌గాం నుంచి చిన్నమావంది గ్రామం వరకు చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను ఎంపి కవిత ప్రారంభిస్తున్నట్టు ఎమ్మెల్యే వివరించారు. అధికారులు సకాలంలో కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.

Check Also

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *