Breaking News

త్రివేణి పుస్తకాలు తెలంగాణ సాహిత్యచరిత్రలో నిలిచిపోతాయి

 

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివి తెలుగు అధ్యయనశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి రాసిన ఆరుపుస్తకాలు తెలంగాణ సాహిత్యచరిత్రలో నిలిచిపోతాయని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు డాక్టర్‌ త్రివేణి ఎంపి కవితను తెలంగాణ భవన్‌లో కలిసి ఆరుపుస్తకాలను అందజేశారు. ఇటీవల తెవివిలో పుస్తకావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే.

ఈసందర్భంగా ఎంపి రాలేకపోయినందుకు ప్రత్యేకంగా కలిసి పుస్తకాలు అందజేసినట్టు పేర్కొన్నారు. పుస్తకాలు స్వీకరిస్తూ ఎంపి మాట్లాడుతూ తెలుగు, తెలంగాణ ప్రాచీన, ఆధునిక కవిత్వం, వచన సాహిత్యం, జానపద, భాష, అనువాద, తులనాత్మక సాహిత్యాల మీద రాసిన వ్యాసాలు విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయ్తుంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా తెలుగు, తెలంగాణ స్త్రీల సాహిత్యాలకు చెందిన వ్యాసాలతో కూడిన రెండు పుస్తకాలను ప్రచురించడం ముదావహమని ఎంపి అన్నారు. ఈ రచనలు తెలంగాణ సాహిత్య సాంస్కృతిక వికాసానికి చక్కని యోగదానాన్ని కల్పిస్తాయని కొనియాడారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *