Breaking News

Daily Archives: April 20, 2016

శాంతియుతంగా పరిష్కరించుకోండి

  – ఆర్డీవో యాదిరెడ్డి నందిపేట, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇసుక గొడవను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆర్డీవో యాదిరెడ్డి కోరారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తల్వేద గ్రామంలో అర్గుల రాజేందర్‌ అనే రైతు తన పట్టాభూమినుంచి ఇసుక మేటలు తీసేసుకొని వ్యవసాయ భూమిగా మార్చుకుంటామని ప్రభుత్వ అనుమతి పొందారు. అయితే ఇసుక మేటలు తీయడం వల్ల గ్రామంలోని భూగర్భజలాలు అడుగంటిపోతాయని, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు అడ్డుచెప్పడంతో పంచాయతీ ...

Read More »

ప్రజల నిలదీతతో నిష్క్రమించిన సర్పంచ్‌

  నందిపేట, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీలో నీటి సమస్యపై ప్రజలు నిలదీయడంతో గ్రామ సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌ మధ్యలోంచి నిష్క్రమించాడు. వివరాల్లోకి వెళితే… సోమవారం జరగాల్సిన గ్రామసభ సర్పంచ్‌, పాలకవర్గ సభ్యుల కోరం లేదని వాయిదా వేశారు. తిరిగి బుధవారం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో నీటి సమస్యపై నిలదీయడానికి ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కరువు కారనంగా తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పటికి నీటి ఎద్దడి ...

Read More »

ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డు వాంబే కాలనీ వాసులు బుధవారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెరాస మైనార్టీ సెల్‌ పట్టణ అద్యక్షుడు ఎం.డి. షౌకత్‌ అలీ మాట్లాడుతూ 8వ వార్డు వాంబే కాలనీ వాసులకు 200 మందికి నల్లా కనెక్షన్‌ మంజూరు చేసి గోదావరి జలాలు అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేకు కాలనీ వాసుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌, రిజ్వాన్‌, పాషా, ...

Read More »

అభివృద్ది పనుల టెండరు ప్రక్రియ చేపట్టాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులకు సంబంధించి బల్దియా అధికారులు వెంటనే అభివృద్ది పనుల టెండరు ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని బుధవారం కామారెడ్డి మునిసిపల్‌ కౌన్సిలర్‌లు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14వ ఫైనాన్స్‌ కమీషన్‌ నిధులతో పట్టణంలో చేపట్టనున్న పనులకు సంబంధించి పురపాలక మండలి గత ఆగష్టులో ఆమోదం తెలిపామన్నారు. ఈ పనుల టెండరు ప్రక్రియను ఈరోజువరకు మునిసిపల్‌ అధికారులు నిర్వహించలేదని పేర్కొన్నారు. ...

Read More »

ఘనంగా బాబు జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 66వ జన్మదిన వేడుకలను బుధవారం కామారెడ్డిలో టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టిడిపి కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.డి. ఉస్మాన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు చీల ప్రభాకర్‌లు కేక్‌ కట్‌చేసి బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు ఎనలేని కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ...

Read More »

పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టన ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తున్నట్టు మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. బుధవారం స్థానిక నీటి విభాగం శాఖ వద్ద వాటర్‌ ట్యాంకర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఇందుకోసం సరంపల్లి వద్ద మూడు బోర్లు, దేశయ్‌ బీడీ, రాజీవ్‌ పార్కు, సిరిసిల్ల రోడ్డులో మూడు ...

Read More »

పరిశోధనను కెరీర్‌గా ఎంచుకోండి

  – ప్రొఫెసర్‌ రాఘవేంద్ర డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యమైన సీరియస్‌ పరిశోదనలను కెరీర్‌గా ఎంచుకోవాలని విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ మాజీ డీన్‌ ప్రొఫెసర్‌ ఏ.ఎస్‌.రాఘవేంద్ర పిలుపునిచ్చారు. పరిశోధనల ద్వారానే సైన్స్‌లో మరింత పురోగతి సాధిస్తామని, మానవ మనుగడకు ఎదురవుతున్న సవాళ్లను పరిశోధనల ద్వారానే పరిష్కారాలు సూచించగలమని ఆయన అన్నారు. బుధవారం ట్రిప్‌ విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వృక్షశాస్త్రం, పరిశోధనలు అనే అంశంపై ఉత్సాహవంతమైన ప్రసంగం చేశారు. వృక్షాలు ప్రకృతి ప్రసాదించిన గొప్పవరమని, ...

Read More »

21 నుంచి వేసవికాల ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణయూనివర్సిటీ జాతీయసేవా పథకం యూనిట్‌-1 ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు వేసవి కాల ప్రత్యేక శిబిరం మిట్టాపల్లి గ్రామంలో ఏర్పాటుచేస్తున్నట్టు ప్రోగ్రాం ఆఫీసర్‌ కొండా రవిందర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో స్వచ్చభారత్‌, మూడనమ్మకాల నిర్మూలన, సమాజంలోని అసమానతల నిర్మూలన, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవడం, పర్యావరన పరిరక్షణ, విద్యాపరమైన అవకాశాలు, మహిళల, పిల్లల ఆరోగ్య పరిరక్షణకై తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తామని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్‌ ఆచార్య ...

Read More »

అంతర్గత నాణ్యతా ప్రమాణాలు కీలకం

  – రిజిస్ట్రార్‌ లింబాద్రి డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకింగ్‌ పొందాలంటే అంతర్గత నాణ్యత ప్రమాణాల మెరుగుకోసం కృషి చేయాలని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. బుధవారం తెయు ఇంటర్నల్‌ క్వాలిటి అసెస్‌మెంట్‌ సెల్‌ సమీక్ష సమావేశం వివిధ విభాగ అధిపతుల సమక్షంలో రిజిస్ట్రార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్సిటీలో అకడమిక్‌ ప్రమాణాలు పెంచడానికి విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటామని, ప్రతి అధ్యాపకుని పనితీరును వారి ఫీడ్‌బ్యాక్‌ ద్వారా ...

Read More »

బయోమెట్రిక్‌ సంతకాలు చేయని అధికారులు – పట్టించుకోని జిల్లా అధికారులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు అందేలా అధికారులు చూసేవిధంగా జిల్లా కలెక్టర్‌ అన్ని మండలాల్లో రెవెన్యూ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ సంతకాల సేకరణ విధానం ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్‌ సంతకాల వల్ల అధికారులు సక్రమంగా విదులు నిర్వహిస్తారని, సమయ వేళలు పాటిస్తారని ఏర్పాటు చేసినప్పటికి మండల రెవెన్యూ, మండల పరిషత్‌ అధికారులు మినహా, వ్యవసాయ, విద్యాశాఖ, ఇరిగేషన్‌, ...

Read More »

27న ఖమ్మంలో జరిగే తెరాస ప్లీనరీ సమావేశం జయప్రదం చేయాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఈనెల 27న మొట్టమొదటిసారిగా తెరాస ప్లీనరీ సమావేశం నిర్వహిస్తుందని, సమావేశాన్ని జయప్రదం చేయాలని మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియా, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మధు, పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్‌, జిల్లా మైనార్టీ కో ఆప్షన్‌ సభ్యులు ఇంతియాజ్‌, మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, వైస్‌ ఎంపిపి జాగిరపు మోమన్‌రెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు కోరారు. బుధవారం మోర్తాడ్‌ పార్టీ కార్యాలయంలో ప్లీనరీ ...

Read More »

దొన్కల్‌లో అగ్నిప్రమాదం

  – 4 లక్షల ఆస్తినష్టం మోర్తాడ్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దొన్కల్‌ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అదేగ్రామానికి చెందిన తీగల భూమారెడ్డి రైతుకు సంబంధించిన పశువుల కొట్టం, గడ్డివాము, పాత ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఇందులో సుమారు 4 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. దొన్కల్‌ గ్రామ పంచాయతీలో గ్రామసభ జరుగుతుండగా ప్రమాద విషయం తెలుసుకున్న మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌ సత్తమ్మ, హనుమాగౌడ్‌, రెవెన్యూ అధికారులు ...

Read More »

రైతు కిసాన్‌పై గ్రామసభలు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు కిసాన్‌పై బుధవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల్లో రైతు కిసాన్‌ పథకం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరించారు. మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌ రామన్నపేట్‌ గ్రామంలో, ప్రోగ్రాం అధికారి నర్సయ్య ధర్మోరా గ్రామంలో గ్రామ సభలు సందర్శించి గ్రామస్తులకు వివరించారు. అదేవిధంగా హరితహారం మొక్కలను పరిశీలించారు. రైతులు, ...

Read More »

కృపాల్ సింగ్ బలిదానం వ్యర్థం కారాదు

కృపాల్‌సింగ్ పేరు విన్నారా? అతనిని 1992లో వాఘా వద్ద సరిహద్దులు దాటుతుండగా చూశాను అని పాకిస్తాన్ చెబుతున్నది. గత పాతిక సంవత్సరాలుగా ఇతడు కోట్ లక్‌పాట్ జైలులో (పంజాబ్ ప్రావెన్స్) మగ్గుతున్నాడు. 2016, ఏప్రిల్ 13న అతడిని లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ మరణించినట్లు ప్రకటించారు. గూఢచారి అంటూ పాక్ ప్రభుత్వం అతనిపై నేరారోపణ చేసింది.కృపాల్ సింగ్‌కు ఒక సోదరి ఉంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అఫ్జల్ గురును ఉరితీయవద్దు-అది జుడీషియల్ మర్డర్ అంటూ గొంతు చించుకొని పూనకం వచ్చినట్టు ఊగిన కన్హయ్యకుమార్, ...

Read More »

ధర్మ సంస్థాపనే రామావతార పరమార్థం (నేడు ఒంటిమిట్టలో కల్యాణం)

కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుపుకునే రోజు ఇది. భద్రాచలంలో శ్రీరామనవమి, అంటే రాముడి పుట్టిన రోజు జరిగిందది. చైత్ర మాసం-శుక్లపక్ష్యం- నవమి తిథి నాడు పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం- కర్నాటక లగ్నంలో, చంద్రుడిని కూడి న బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం జరిగింది. వివాహం జరిగింది నవమినాడు కాదు. యథావాల్మీకమైన ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారు రాసినదాన్ని బట్టి చూస్తే, సౌమ్య నామసంవత్సరం, మాఖ బహుళంలో శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తనవెంట యాగ రక్షణకు తీసుకెళ్తాడు. 27వ ...

Read More »

చిక్కుల్లో రూ. 12 లక్షల కోట్ల రుణాలు

ముంబయి, ఏప్రిల్ 19: భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్ బకాయిలు వణికిస్తున్నాయి. మొత్తం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఉనికికే మొండి బకాయిలు పెను ప్రమాదంగా మారడం కార్పొరేట్ల చలవే. దేశీయ బ్యాంకింగ్ రుణాల్లో 16.1 శాతం ఇప్పుడు చిక్కుల్లో ఉండగా, ఇవన్నీకూడా కార్పొరేట్ వర్గాలకిచ్చినవే కావడం గమనార్హం. వీటి విలువ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు. అవును.. దేశంలోని బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల విలువ ప్రస్తుతం 1,109 బిలియన్ డాలర్లుగా ఉంటే, అందులో 178 బిలియన్ డాలర్ల రుణాలు డిఫాల్ట్ సమస్యను ...

Read More »

విమానాశ్రయంలో నక్కలు

భువనేశ్వర్‌: భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే పై సంచరిస్తున్న నక్కలను అటవీ అధికారులు బంధించారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న వీటిని బంధించేందుకు ‘ఆపరేషన్‌ ఫాక్స్‌’ను అటవీశాఖ అధికారులు, విమానాశ్రయం సిబ్బంది అమలు చేస్తున్నారు. ఇప్పటికే అయిదు నక్కలను పట్టుకోగా మంగళవారం మరో నక్క బోనులో చిక్కింది. టర్మినల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో మంగళవారం చిక్కిన ఈ నక్కను చందకా అడవిలో విడిచి పెట్టారు.

Read More »

భారీ బాంబు పేలుళ్లకు ఐఎస్‌ఐఎస్‌ టెర్రరిస్టులు కుట్ర

యూరప్‌ సముద్ర తీరాల్లో వేసవి విడిది కోసం వచ్చే పర్యాటకులే లక్ష్యంగా భారీ బాంబు పేలుళ్లకు ఐఎస్‌ఐఎస్‌ టెర్రరిస్టులు కుట్రపన్నారు. ముఖ్యంగా స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్‌ రిసార్ట్‌లను లక్ష్యంగా చేసుకోవాలని, బీచ్‌ ఒడ్డున సన్‌ బెడ్‌ల కింద బాంబులు అమర్చాలని, పర్యాటకులకు ఐస్‌క్రీమ్‌లు, స్నాక్‌లు, టీషర్టులు అమ్మే హ్యాకర్ల అవతారంలో ఆత్మాహుతి జాకెట్లను ధరించి వెళ్లాలంటూ టెర్రరిస్టు నాయకులు తమ అనుచరులకు తాజా ఆదేశాలు జారీ చేసినట్లు జర్మనీ, ఇటలీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. రిసార్ట్‌లపై జరిపే దాడుల్లో బాంబులు, ఆత్మాహుతి జాకెట్లతోపాటు ఆటోమేటిక్‌ ...

Read More »

రానున్న రోజుల్లో చెరువులకు జలకళ

  పిట్లం : మిషన్ కాకతీయ పథకంతో రానున్న రోజుల్లో చెరువులకు జలకళ రానుందని ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.మండల కేంద్రంలోని రాజన్నకుంట చెరువులో మిషన్ కాకతీయ రెండో విడత పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. రాజన్నకుంటలో రూ.27.26 లక్షలతో పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పనులు పూర్తయితే 30ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుందన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతగా చేపట్టి చెరువు అభివృద్ధికి సహకరించాలన్నారు. చెరువు పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లో వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచి హన్మ గంగారాం, ...

Read More »

హత్యకేసులో ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

  బోధన్: వర్ని మండలం తిమ్మాపూర్‌లో ఈ నెల 16న గైని సాయిలు అనే వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో ఎనిమిది మంది నిందితులను గుర్తించి వారిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. అరెస్ట్‌యిన ఎనిమిది మంది నిందితులను బోధన్‌లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ హాజరుపర్చారు. గైని సాయిలు మరో ఇద్దరు కలిసి మూడు నెలల కిందట తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గూండ్ల మొగులయ్య అనే వ్యక్తిని హత్యచేసి, ఆ హత్యకేసులో జైలులో ఉన్నారన్నారు. ఈ నెల 12న గైని ...

Read More »