Breaking News

పరిశోధనను కెరీర్‌గా ఎంచుకోండి

 

– ప్రొఫెసర్‌ రాఘవేంద్ర

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యమైన సీరియస్‌ పరిశోదనలను కెరీర్‌గా ఎంచుకోవాలని విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ మాజీ డీన్‌ ప్రొఫెసర్‌ ఏ.ఎస్‌.రాఘవేంద్ర పిలుపునిచ్చారు. పరిశోధనల ద్వారానే సైన్స్‌లో మరింత పురోగతి సాధిస్తామని, మానవ మనుగడకు ఎదురవుతున్న సవాళ్లను పరిశోధనల ద్వారానే పరిష్కారాలు సూచించగలమని ఆయన అన్నారు. బుధవారం ట్రిప్‌ విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వృక్షశాస్త్రం, పరిశోధనలు అనే అంశంపై ఉత్సాహవంతమైన ప్రసంగం చేశారు. వృక్షాలు ప్రకృతి ప్రసాదించిన గొప్పవరమని, వాటిని కాపాడుకోవడం, మరింత అభివృద్ది చేసుకోవడం అత్యంత ఆవశ్యకమన్నారు. ఆయన వృక్షాలపై ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌, చూపిన చలనచిత్రం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు అత్యవసరమని ఆయన తెలిపారు.

Check Also

ఘనంగా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని పి.వి నరసింహ రావు శతజయంతి ...

Comment on the article