Breaking News

Daily Archives: April 21, 2016

ఒడ్డేడ్‌పల్లిలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్టాపన

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం ఒడ్డేడ్‌పల్లి గ్రామంలో గురువారం హనుమాన్‌ భక్తులు, గ్రామస్తులు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యుల ఆద్వర్యంలో హనుమాన్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హనుమాన్‌ భక్తులు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామ శివారులోని ఒడ్డేడ్‌ చెరువు పక్కన విగ్రహాన్ని ప్రతిష్టించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గీత, తెరాస నాయకులు సత్యం, ఉపసర్పంచ్‌ అరుణ్‌, చిరంజీవి, ఒడ్డెన్న, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు ...

Read More »

తిమ్మాపూర్‌ కార్యదర్శి పదోన్నతిపై బదిలీ

  మోర్తాడ్‌ మండలానికి నూతన కార్యదర్శులు రాక మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన ఆర్‌.నాగరాజు పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. మోర్తాడ్‌ మండలానికి ఇతర మండలాల నుంచి మోర్తాడ్‌ కార్యదర్శిగా ఎస్‌.కె.జావిద్‌, తిమ్మాపూర్‌ కార్యదర్శిగా స్వామి, దొన్కల్‌ కార్యదర్శిగా జాన్‌లను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ గత రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసినట్టు ఎంపిడివో శ్రీనివాస్‌ గురువారం తెలిపారు. రెండ్రోజుల్లో నూతన కార్యదర్శులు విధుల్లో చేరనున్నట్టు ఆయన తెలిపారు.

Read More »

విద్యుత్‌ ఉద్యోగుల చలివేంద్రం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ కార్యాలయం ముందు గురువారం విద్యుత్‌ ఉద్యోగుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. కామారెడ్డి డివిజన్‌లోని విద్యుత్‌ ఉద్యోగుల ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌కో డివిజనల్‌ ఇంజనీర్‌ శేషారావు రాథోడ్‌ ప్రారంభించారు. పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యుత్‌ బిల్లుల వసూలు కేంద్రం ఉండడంతో ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుందని, వారి సౌకర్యార్థం దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు.

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డు ఆజంపురాలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మిస్తున్న మురికి కాలువ నిర్మాణ పనులను గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ నిధులు రూ. 1.50 లక్షల వ్యయంతో కాలువ నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్‌ శశిరేఖ, దయానంద్‌, ఏ.ఇ గంగాధర్‌, నాయకులు కృపాల్‌, ప్రసాద్‌, గోనె శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సిఎం సహాయనిధి చెక్కు పంపిణీ

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని షెట్పల్లి గ్రామానికి చెందిన బండారు విఠల్‌ అనే బాధిత కుటుంబానికి గురువారం తెరాస పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు కల్లడ ఏలియా, సిఎం సహాయ నిధి చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండారు విఠల్‌ అనారోగ్యానికి గురికావడంతో అప్పు చేసి చికిత్స చేయించుకున్నారని, ఈ విషయమై బాధితుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆర్థిక సహాయం పొందారన్నారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి సిఎం సహాయనిధి కింద ...

Read More »

హనుమాన్‌ జయంతికి ఆలయాల ముస్తాబు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామల్లో గల హనుమాన్‌ ఆలయాలను జయంతి సందర్భంగా ఆయా గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, దీక్షా స్వాములు అ ందంగా ముస్తాబు చేశారు. శుక్రవారం జరగనున్న హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం షామియానాలు, తాగునీరు, అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తడపాకల్‌, గుమ్మిర్యాల్‌, ఒడ్యాట్‌ గ్రామాల్లో జాతర నిర్వహిస్తారు.

Read More »

నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఏప్రిల్‌ నెలలోనే బోర్లు వట్టిపోతున్నాయని, రానున్న మే మాసంలో మరింత తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనే అవకాశముందని మండల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి గ్రామాల్లో పర్యటిస్తూ నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల తహసీల్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి సంబంధిత అదికారులతో తాగునీటితో పాటు పలు పథకాలపై సమీక్షించారు. మండలంలో తాగునీటి పరిస్థితి ఏవిధంగా ...

Read More »

250 గురుకుల పాఠశాలలకు రూ. 5500 కోట్లు

  – కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 250 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం 5500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ట్రిప్‌-2016 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీలకు 135, ఎస్టీలకు 50, మైనార్టీలకు 65 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ...

Read More »

పోలియో చుక్కల కంటే సూదిమందు నాణ్యమైనది

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో చుక్కలకు బదులు ఇంజక్షన్‌ ద్వారా పిల్లలకు మరింత ఆరోగ్యకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో వైరస్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పోలియో చుక్కల ద్వారా 3 రకాల ద్రవాన్ని పిల్లలకు నేరుగా నోటి ద్వారా వేసే వారని, ప్రస్తుతం అమలు చేయనున్న పోలియో వైరస్‌ వ్యాక్సిన్‌ ద్వారా ఒకేసారి 3 రకాల మందును ...

Read More »

అంగన్‌వాడి కేంద్రాల్లో హాజరును పెంచాలి

  – జిల్లా కలెక్టర్‌ డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కేంద్రాల్లో హాజరును పెంచి వారికి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఐసిడిఎస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం డిచ్‌పల్లి మండలంలో అమృతాపూర్‌ క్యాంపులో అంగన్‌వాడి కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలు తక్కువ ఉండడంపై అంగన్‌వాడి కార్యకర్తను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడి కేంద్రాల్లో విద్యార్థుల హాజరును పెంచడానికి కృషి చేయాలని, కార్యకర్తలు పిల్లల ఇండ్లకు వెళ్ళి పిల్లలను పంపించేలా అవగాహన కల్పించాలని, ...

Read More »

మిషన్‌ కాకతీయతో చెరువుల అభివృద్ది

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులు నీటితో కళకళలాడుతాయని బీర్కూర్‌ ఎంపిపి మల్లెల మీణ, హన్మంతు అన్నారు. గురువారం మండలంలోని అంకోల్‌ గ్రామ పంచాయతీలోగల నల్లచెరువులో రెండోవిడత మిషన్‌ కాకతీయలో భాగంగా 33 లక్షలతో చేపట్టనున్న చెరువు పూడికతీత పనులను జడ్పిటిసి కిసన్‌ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ కాకతీయుల కాలంలో చెరువులు నిర్మించారని, వాటిని గత ప్రభుత్వాలు పూడికతీయకపోవడం వల్ల మట్టి పేరుకుపోయి చెరువుల్లో నీటి ...

Read More »

విద్యుత్‌ ఘాతంతో ఒకరు మృతి

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌లో జరిగే జాతరకు విద్యుత్‌దీపాలు అలంకరించడానికి వెళ్లిన గ్రామ పంచాయతీ పారిశుద్య కార్మికుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… బీర్కూర్‌ గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్య కార్మికుడు పోతరాజు సాయిరాం, సాయిలు, మరో ఇద్దరు పారిశుద్య కార్మికులతో గ్రామంలోగల సెంటర్‌ లైట్‌ అమర్చి నిచ్చెన పక్కకు తొలగిస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురికావడంతో పోతరాజు సాయిరాం (25), సాయిలు ...

Read More »

నీలాలో రైతు కరువు యాత్ర

  రెంజల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం నీలా గ్రామంలో గురువారం బిజెపి అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి రైతు కరువు యాత్ర కొనసాగించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి 24 వరకు రైతు కరువు యాత్ర చేపట్టినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. నీలాగ్రామంలో మిషన్‌ కాకతీయ పనులను పరిశీలించిన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్‌ కాకతీయ మంచిపథకంలో కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడుతూ అసంపూర్తిగా పనులు ...

Read More »

ఇంకుడు గుంతల పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు స్థానిక నాయకులు గురువారం ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు స్వగ్రామంలో వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని వారన్నారు. కార్యక్రమంలో నాయకులు వాజిద్‌, మహేందర్‌, కారోబార్‌ అంజయ్య, తదితరులున్నారు.

Read More »

సమస్య పరిష్కారానికి కృషి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృసి చేస్తున్నట్టు గ్రామ సర్పంచ్‌ స్వప్న అన్నారు. మండలంలోని ఆరేడు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలోఆమె మాట్లాడారు. వర్షాభావ పరిస్తితుల వల్ల బోరుబావుల్లో బూగర్భజలాలు అడుగంటడంతో తాగునీటి సమస్య ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. నీటి ఎద్దడి నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటిపన్నులు, కుళాయి పన్నులు చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్దికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలకు ఉపాధి కరువైందన్నారు. ...

Read More »

గర్భకోశ క్యాన్సర్‌ నివారణకు సహకరించాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భకోశ క్యాన్సర్‌ నివారణకు మహిళలు సహకరించాలని ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిణి స్పందన కోరారు. మండలంలోని ఐకెపి కార్యాలయంలో నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భకోశ క్యాన్సర్‌ వ్యాధులపైప్రయివేటు ఆసుపత్రులో లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్‌ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. 35 సంవత్సరాల వయసు నిండిన మహిళలు క్యాన్సర్‌ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం ఐకెపి ఏరియా కో ఆర్డినేటర్‌ మారుతి మాట్లాడుతూ స్త్రీనిధి ...

Read More »

పెరిగిన పసిడి, వెండి ధరలు

బుధవారం బంగారం ధర పెరిగింది. రూ.105 పెరగడంతో 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,290కి చేరింది.అలాగే 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ.29,185కు చేరింది. నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా యూరోపియన్‌ ట్రేడ్‌లో ఔన్సు బంగారం ధర 1,258 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. రూ.నలభై వేల మార్కును చేరిన వెండి బుధవారం వెండి రూ.40,000 మార్కును చేరింది. ఒక్కరోజులోనే రూ.1,615 పెరగడంతో ...

Read More »

తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో ఘనంగా చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి డా: నారా చంద్ర బాబు గారి జన్మ దిన వేడుకలు కువైట్ లో తెలుగు దేశం ఘనంగా ఘనంగా జరిగాయి. తెలుగుదేశం కువైట్ పార్తీ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారి ఆద్వర్యములో జరిగిన ఈ వేడుకల్లో తెలుగుదేశం అభిమానులు, నారా మరియు నందమూరి అభిమానులు, పరిటాల అబిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మోహన్ బాబు గారి స్వాగతోపన్యాసముతో సభ ప్రారంబమయి, అధ్యక్ష్యులు సుధాకర రావు గారి సందేశముతో ముగిసినది.  ఛంద్ర బాబు  గారి స్పూర్తితో ...

Read More »

‘ నిలువు’ దోపిడీ కళ్లారా వీక్షించిన డీఆర్వో

ప్రక్షాళన షురూ కలెక్టరుకు, వక్ఫ్‌ బోర్డు సీఈవోకు నివేదిక వర్ని గ్రామీణం :పవిత్ర పుణ్యక్షేత్రం బడాపహాడ్‌లో భక్తుల నుంచి ఆయా కార్యక్రమాలకు బలవంతంగా సొమ్ము వసూలు చేస్తున్న గుత్తేదారుల సంబంధీకులకు సంబంధించి ‘ఈనాడు’ వరుస కథనాలు సంచలనాలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో డీఆర్వో మోహన్‌లాల్‌ బుధవారం బడాపహాడ్‌ వెళ్లి చేపట్టిన విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గుత్తేదారుల ఏజెంట్లు వక్ఫ్‌ బోర్డు నిర్మించిన షెడ్ల చుట్టూ నిర్మాణాలు చేపట్టి ఇందులోకి భక్తులు వెళ్లకుండా అడ్డుతగులుతున్నట్లు గుర్తించారు. వీరి చర్యలను ఎందుకు అడ్డుకోలేదంటూ వక్ఫ్‌ ...

Read More »

155వ రోజుకు నిజాంషుగర్స్‌ దీక్షలు

బోధన్‌: నిజాంచక్కెర కర్మాగారాల కోసం బోధన్‌లో రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. తెరాస ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు చేసి పరిశ్రమలను స్వాధీనం చేసుకొని నిర్వహణ చేపట్టాలని ఆందోళనకారులు డిమాండు చేస్తున్నారు. బుధవారం అంబేడ్కర్‌ చౌరస్తాలో 155వ రోజుకు చేరిన దీక్షలో కార్మికులు బావన్‌రుషి, సలీం, హైమద్‌ కూర్చున్నారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి దీక్షలను ప్రారంభించి ప్రసంగించారు. శ్రామికులు ఇప్పటికీ గాంధేయ మార్గంలో శాంతియుత ఆందోళన ఎంచుకున్నారని తెలిపారు. ప్రజల ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్‌ కొత్త ...

Read More »