Breaking News

అంగన్‌వాడి కేంద్రాల్లో హాజరును పెంచాలి

 

– జిల్లా కలెక్టర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కేంద్రాల్లో హాజరును పెంచి వారికి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఐసిడిఎస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం డిచ్‌పల్లి మండలంలో అమృతాపూర్‌ క్యాంపులో అంగన్‌వాడి కేంద్రాన్ని పరిశీలించారు.

పిల్లలు తక్కువ ఉండడంపై అంగన్‌వాడి కార్యకర్తను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడి కేంద్రాల్లో విద్యార్థుల హాజరును పెంచడానికి కృషి చేయాలని, కార్యకర్తలు పిల్లల ఇండ్లకు వెళ్ళి పిల్లలను పంపించేలా అవగాహన కల్పించాలని, కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరంగా ఎదుగుతారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపాలని ఆదేశించారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *