Breaking News

Daily Archives: April 22, 2016

ఘనంగా హనుమాన్‌జయంతి వేడుకలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం హనుమాన్‌ జయంతి వేడుకలను విశ్వహిందూ పరిషత్‌, భగరంగ్‌ దళ్‌ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు. కోడూరు హనుమాన్‌ దేవాలయం నుంచి ప్రారంభించిన యాత్ర పట్టణంలోని ప్రధాన వీదులు రైల్వేకమాన్‌, సాయిబాబా ఆలయం, కొత్త బస్టాండ్‌ మీదుగా పాత బస్టాండ్‌, ఇతర ప్రాంతాల్లో సాగింది. శోభాయాత్ర తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువకులు కాషాయ జెండాలు చేతబట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. 200 మీటర్ల కాషాయ ...

Read More »

ముగిసిన సిపిఎం కరువు యాత్ర

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15న కామారెడ్డి డివిజన్‌లో చేపట్టిన సిపిఎం కరువు యాత్ర శుక్రవారం కామారెడ్డి మండలం బీడీ కాలనీలో ముగిసింది. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ నాయకుడు రాజలింగం మాట్లాడుతూ డివిజన్‌లోని ప్రజలు కరువుతో అల్లాడుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రైతులు ప్రభుత్వం ప్రకటించిన కరువు నివారణ నిదుల కోసం నిరీక్షిస్తున్నారన్నారు. బీడీ కార్మికుల సమ్మె కారణంగా ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ...

Read More »

24న విద్యార్థులకు అవగాహన సదస్సు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యూ సక్సెస్‌ ఆధ్వర్యంలో ఈనెల 24న కామారెడ్డిలో విద్యార్థులకు కెరీర్‌ గైడెన్సు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు న్యూ సక్సెస్‌ ప్రతినిదులు విజయ్‌కుమార్‌, నవీన్‌ తెలిపారు. ప్రముఖ మనోవిజ్ఞాన వేత్తలు రాధాకృష్ణ, వేదప్రకాశ్‌లు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు ఒత్తిడిని జయించి పరీక్షలకు ఎలా సన్నద్దం కావాలో వివరిస్తారన్నారు. మానసిక ధైర్యాన్ని పెంపొందించడమే గాకుండా కెరీర్‌ గైడెన్సుపై సలహాలు ఇస్తారన్నారు. ఇందులో పాల్గొనదలచిన విద్యార్థులు స్తానిక ఆర్యభట్ట ...

Read More »

వాటర్‌ లైన్‌మెన్‌ను తొలగించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 8వ వార్డు వాంబే కాలనీలో వాటర్‌ లైన్‌మెన్‌ గంగాధర్‌ను తొలగించాలని శుక్రవారం కాలనీవాసులు కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట దర్నా నిర్వహించారు. గతంలో మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించి ఛైర్మన్‌కు నీటి ఎద్దడి గురించి వివరించగా, డిపిఎల్‌ కింద నల్లాలు పెట్టుకోవాలని సూచించారన్నారు. ఈ క్రమంలోనే నల్లాలు ఏర్పాటు చేసుకోగా వాటర్‌ మెన్‌ గంగాధర్‌ వచ్చి ఒక్కో కనెక్షన్‌కు 5 వేలు చెల్లించకపోతే నల్లాలు తొలగిస్తామని హెచ్చరిస్తున్నాడని తెలిపారు. తమను బెదిరింపులకు ...

Read More »

మత్స్య కార్మికుల వ్యవస్థ మెరుగుకు పలు కార్యక్రమాలు

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎడపల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో దళారి వ్యవస్థను రూపుమాపి పేద మత్స్య కార్మికులకు నేరుగా లబ్దిచేకూరేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎడపల్లి మండలం జాన్కంపేట్‌లోని అశోక్‌సాగర్‌ చెరువులో కెజి కల్చర్‌ ద్వారా పెంచుతున్న చేపలను జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా బోట్‌లో వెళ్ళి కెజీ కల్చర్‌ బాక్సులలో గల చేపలను వాటి ఎదుగుదలను పరిశీలించారు. ...

Read More »

బాసర ఆలయానికి ఇంజనీర్ల బృందం

  బాసర, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ది చెందిన శ్రీజ్ఞానసరస్వతి బాసర అమ్మవారి ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నట్టు ఇంజనీర్ల బృందం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం 15 మందితో కూడిన ఇంజనీర్ల బృందం ఆలయాన్ని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ది కొరకు మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా గర్భగుడిని విశాలం చేయడం, ...

Read More »

భూమాతను కాపాడుకుందాం

  – డాక్టర్‌ జట్లింగ్‌ యెల్లోసా డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ ధరిత్రి దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని తెవివి న్యాయకళాశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జట్లింగ్‌ యెల్లోసా మాట్లాడుతూ భావిపౌరులైన విద్యార్థులందరు భూగోళం, పర్యావరణం గురించి సంబంధిత చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. సహాయ ఆచార్యులు స్రవంతి మాట్లాడుతూ పర్యావరణ ప్రాధాన్యతని, ఈ యేడు ముఖ్య శీర్షిక అయిన ...

Read More »

కూలర్ల కొరత

  నందిపేట, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో, నందిపేట మండలంలో మునుపెన్నడూ లేనివిధంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడుతుండడంతో ప్రజలు బయటకు వెళదామంటేనే జంకుతున్నారు. తీరా ఇంట్లోనైనా కూర్చుందామంటే ఉక్కపోతతో ఊపిరాడడం లేదు. ఉపశమనం పొందడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో కూలర్లు కొనుగోలు చేయడంతో కూలర్లు అమ్మే దుకాణాల వల్ల పండగ సందడి నెలకొంది. రూ. 2 వేలకు అమ్మే కూలర్లు స్టాక్‌ లేదని దుకాణం దారులు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ముందే కరువు కారణంగా ...

Read More »

బీర్కూర్‌లో గజ్జలమ్మ జాతర

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని గజ్జలమ్మ జాతర నిర్వహిస్తున్నట్టు గ్రామ సర్పంచ్‌ దూలిగె నర్సయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈయేడు కూడా హనుమాన్‌ జయంతి అనంతరం జాతర కొనసాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున ఆలయం నుంచి రథం గాంధీచౌక్‌లోని హనుమాన్‌ మందిరానికి వస్తుందని, తిరిగి ఆలయానికి చేరుకుంటుందని అన్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ఉంటుందన్నారు. ఆదివారం కుస్తీపోటీలు నిర్వహించడం ...

Read More »

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

  బోధన్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హనుమాన్‌ జయంతి వేడుకలు మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బోదన్‌ పట్టణంలో బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం పెద్ద హనుమాన్‌ మందిరం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఊరేగింపులో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను బోధన్‌ సిఐ వెంకన్న ఆద్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read More »

పలు అభివృద్ది పనులకు భూమిపూజ

  బోధన్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మండలంలోని జాడిజమాల్‌పూర్‌, ఎరాజ్‌పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే నిదుల నుంచి చేపట్టనున్న పలు అబివృద్ది పనులకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు భూమిపూజలు నిర్వహించారు. జాడిజమాల్‌పూర్‌ గ్రామంలో 5 లక్షల సిడిపి నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు గ్రామ సర్పంచ్‌ భూమిపూజ చేశారు. ఎరాజ్‌పల్లి గ్రామంలో మహిళా మండలి భవనానికి స్థానిక నాయకులు, గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసిలు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సబిత, రాములు, తెరాస మండల కమిటీ అధ్యక్షుడు సంజీవ్‌ ...

Read More »

బస్తీమే సవాల్‌

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్వా గ్రామంలో శుక్రవారం కుస్తీపోటీలు ఘనంగా నిర్వహించారు. పోటీల్లో కొబ్బరికాయతో ప్రారంభమై రసవంతంగా సాగాయి. వివిద ప్రాంతాలకు చెందిన మల్లయోధులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. విజయం సాదించిన మల్లయోధులకు నగదు బహుమతులు స్థానిక సర్పంచ్‌ గొట్టం అనసూయ, నర్సింలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిజాంసాగర్‌ ఎస్‌ఐ అంతిరెడ్డి ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పంట పొలాలకు మట్టి తరలింపు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువులో మట్టిని వ్యవసాయ భూముల్లో వేసుకుంటే భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చన్న ఉద్దేశంతో రైతులు చెరువు మట్టిని పొలాల్లో తరలించుకుంటున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మల్లూరు గ్రామ ఊర చెరువునుంచి నల్లమట్టిని జేసిబి ద్వారా ట్రాక్టర్లో నింపి రైతులు ఉత్సాహంగా పొలాల్లో చల్లుతున్నారు. రైతులందరు ఐక్యంగా జేసిబిని, ట్రాక్టరును అద్దె ప్రాతిపదికన తీసుకొని మట్టిని తరలించుకుపోతున్నారు. గ్రామంలోని ట్రాక్టర్లన్ని అద్దెకు తీసుకొని నల్లమట్టిని పొలాలకు తరలిస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ ...

Read More »

కొలతల ప్రకారం పనిచేయాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొలతల ప్రకారం పనిచేస్తేనే కూలీ గిట్టుబాటు అవుతుందని ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. సింగీతంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కూలీలు మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తున్నా కూలీ గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపిడివో మాట్లాడుతూ ఉపాధి సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేస్తే కూలీ గిట్టుబాటు అవుతుందన్నారు. పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల అనుకున్న కూలీ రావడం లేదని పేర్కొన్నారు. వేసవి దృష్టిలో ...

Read More »

నీటిని పొదుపుగా వాడుకోవాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి ఎండల్ని దృష్టిలో పెట్టుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని గున్కుల్‌ గ్రామ కార్యదర్శి ఇలియాజ్‌ అన్నారు. శుక్రవారం సుంకిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని, గ్రామస్తులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టాలన్నా ప్రజలు, పంచాయతీ పన్నులు సకాలంలో చెల్లించాలన్నారు. పంచాయతీలో నిధుల కొరత వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గ్రామస్తులు పన్నులు చెల్లించి సహకరించాలని ...

Read More »

మమ్నల్ని ఆదుకోండి…

  – ఇరాక్‌ బాధితుల ఆక్రందన సెంట్రల్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కూటికోసం పొట్ట చేతబట్టుకొని దూరదేశాలకు పోయినం… కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లల్ని వదిలి అన్నమో రామచంద్ర అని నాలుగు డబ్బులు సంపాదిద్దామని సుదూర ప్రాంతాలకు పోయినం… మా అమాయకత్వం మమ్నల్ని బలిచేసింది… దిక్కుతోచని స్థితికి తోసేసిందని ఇరాక్‌ బాధితులు నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధితో ఫోన్‌ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. నందిపేట మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన దిలీప్‌ గత ఐదునెలల క్రితం విసిట్‌ ...

Read More »