Breaking News

అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి

వర్ని: మోస్రా గ్రామానికి చెందిన గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ అంజయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌ గ్రామానికి చెందిన కంది లక్ష్మి(30) అనే యువతికి మోస్రా గ్రామానికి చెందిన హన్మాండ్లుతో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు భార్యభర్తల కాపురం సజావుగా సాగింది. మూడు సంవత్సరాల క్రితం భర్త హన్మాండ్లు కుటుంబ పోషణ నిమిత్తం దుబాయ్‌ వెళ్లి వచ్చాడు.
ఈ క్రమంలో అనుమానాలతో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. మూడు నెలల క్రితం భార్య లక్ష్మి పుట్టింటికి వెళ్లింది. పెద్దల పంచాయతీతో నెల క్రితం భర్త వద్దకు వచ్చింది. శనివారం రాత్రి భార్య, భర్త ఇంట్లోనే ఉన్నారు. ఆదివారం ఉదయం భర్త హన్మాండ్లు లేచి చూసేసరికి లక్ష్మి మృతి చెంది ఉంది. స్థానికుల సమాచారంతో వర్ని పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. భర్త హన్మాండ్లు హత్య చేసి ఉండవచ్చునని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Check Also

భారీగా గుట్కా స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు భారీ మొత్తంలో ...

Comment on the article